
ఉచిత ఫుట్‌బాల్ వేసవి శిబిరం
తిరుపతి సిటీ :స్థానిక ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని టీటీడీ వినాయకనగర్ క్వార్టర్స్ గ్రౌండ్‌లో 8 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సుగల బాల, బాలికలకు ఉచితంగా ఫుట్‌బాల్ శిక్షణ ఇస్తున్నట్లు కోచ్ లోకేష్ తెలిపారు. విద్యార్థులకు సెలవుల నేపథ్యంలో క్రీడల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉచిత సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6.30 వరకు ప్రతి రోజు ఉచిత శిక్షణ ఇస్తున్నామని ఆసక్తి గల విద్యార్థులు ఉచిత శిక్షణలో పాల్గొనవచ్చునన్నారు. ఈ శిబిరం వచ్చేనెల 3వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 99664 31378 నంబర్ నందు సంప్రదించవచ్చునని తెలిపారు.
విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్న కోచ్ లోకేష్