
ఉద్యోగం..లక్ష్యానికి ఆరంభం
చంద్రగిరి : ఉద్యోగం అనేది మీ జీవిత లక్ష్యానికి కేవలం ఆరంభం మాత్రమే అని, మీ ఉన్నతికి పడిన తొలిమెట్టుగా భావించి మరింత ఉన్నత స్థాయికి చేరుకునేందుకు కృషి చేయాలని మోహన్ బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ప్రో చాన్సలర్ మంచు విష్ణు తెలిపారు. బుధవారం తిరుపతికి సమీపంలోని ఎంబీయూలో అచీవర్స్ డే–2025 కనిర్వహించారు. ఈ విద్యాసంవత్సరంలో ప్లేస్‌మెంట్లు సాధించిన సుమారు 1,500 మంది విద్యార్థులు హాజరయ్యారు. విష్ణు మాట్లాడుతూ.. ఉద్యోగం ఇచ్చిన సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. జీతం కోసమే కాకుండా మీ లక్ష్యాన్ని అధిగమించేలా పనితీరు ఉండాలని కోరారు. అనంతరం ప్లేస్‌మెంట్ సాధించిన విద్యార్థులకు పలు కంపెనీల నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరి, ప్రో వోస్ట్ నాగరాజ రామారావ్, వీసీ కరుణాకరణ్, స్ట్రాటజిక్ అధికారి వికాస్ సింగ్, రిజిస్ట్రార్ సారథి పాల్గొన్నారు.
నేడు పెన్ స్టేట్ వర్సిటీతో ఎంఓఏ
అమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీతో మెమోరాండం ఆఫ్ అసోసియేషన్(ఎంఓఏ) గురువారం చేసుకోనున్నట్లు ఎంబీయూ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి పెన్ స్టేట్ యూనివర్సిటీ చాన్సలర్ డాక్టర్ డేవిడ్ ఎం కాల్లెజో పెరెజ్, వీసీ డాక్టర్ వాహిద్ మోటేవల్లి హాజరుకానున్నారని వెల్లడించారు.
ఎంబీయూలో ఘనంగా అచీవర్స్ డే