
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
తడ : మండలంలోని తడకండ్రిగ పంచాయతీ బీఎల్‌పాడు గ్రామ సమీపంలో సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం కదులుతున్న రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. సూళ్లూరుపేట జీఆర్‌పీ ఎస్‌ఐ చెన్నకేశవ తెలిపిన సమాచారం మేరకు ..ఓ వ్యక్తి మృతదేహం పట్టాల మధ్య ఉన్నట్లు తడ రైల్వేస్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగేళ్ల చిన్నారిపై అసభ్య ప్రవర్తన
– వృద్ధుడికి గ్రామస్తుల దేహశుద్ధి
గూడూరు రూరల్ : ఆడుకుంటున్న ఓ చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించిన ఓ వృద్ధుడికి స్థానికులు దేహశుద్ధి చేసిన సంఘటన మంగళవారం గూడూరు మండలం చెన్నూరులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు గ్రామ సమీపంలో ఆడుకుంటున్న ఓ చిన్నారికి అదే ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వృద్ధుడు సిరాజ్‌ఖాన్ (మస్తాన్ ) మద్యం మత్తులో చాక్లెట్ ఇస్తానని మాయ మాటలు చెప్పి పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు. చిన్నారితో అసభ్య ప్రవర్తనకు పాల్పడుతున్న సమయంలో గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేశారు. వృద్ధుడు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించడంతో స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు.
ఆటోను ఢీకొన్న టిప్పర్
● ఇద్దరికి తీవ్ర గాయాలు, 9 మందికి స్వల్పగాయాలు
బుచ్చినాయుడుకండ్రిగ : మండలంలోని పదవమైలు గ్రామం వద్ద కేటీరోడ్డుపై సోమవారం అర్ధరాత్రి ఆటోను టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు, 9 మందికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. సోమవారం తమిళనాడు రాష్ట్రం పెరంబదూర్‌కు చెందిన 11 మంది శ్రీకాళహస్తికి దైవ దర్శనానికి బస్సులో బయలుదేరి వరదయ్యపాళెంకు వచ్చారు. అక్కడి నుంచి ఆటోలో శ్రీకాళహస్తికి బయలుదేరారు. పదోమైలు గ్రామం వద్ద కేటీరోడ్డుపై ఆటోను ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా 9 మందికి స్వల్పగాయాలయ్యాయి. వీరిని శ్రీకాళహస్తిలోని ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి తీవ్రంగా గాయపడిని ఇద్దరిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
ఎకై ్సజ్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డిప్యూటీ కమిషనర్
వాకాడు : మండల కేంద్రమైన వాకాడులోని ఎకై ్సజ్ అండ్ ప్రొహిభిషన్ స్టేషన్‌ని మంగళవారం చిత్తూరు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్‌లోని రికార్డులు పరిశీలన చేశారు. అలాగే బెల్టుషాపులు, కల్తీకల్లు అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట సీఐ ప్రసాద్, సిబ్బంది ఉన్నారు.
రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక
పెళ్లకూరు : మండలంలోని రోసనూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీల్లో 48 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. జిల్లా స్థాయిలో అండర్–17, అండర్–23 విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈనెల 16 నుంచి 18 వరకు చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా కార్యదర్శి ఉదయ్‌కుమార్ తెలిపారు. రెజ్లింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్ నాగూరయ్య, కోచ్ లోకేష్ ప్రసాద్ పాల్గొన్నారు.

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి