
తల్లిదండ్రులను అభినందించాలి
చిన్ననాటి నుంచి పిల్లలకు కష్టం విలువ తెలియజేయాలి. కొందరు ఎంత డబ్బులు అడిగితే అంత చేతికి అందించి పెడదోవ పట్టిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. రూపాయిని ఎలా సంపాదిస్తున్నారనే విషయాన్ని చిన్ననాటి నుంచే పిల్లలకు ప్రత్యక్షంగా తెలియజేస్తే మంచిది. కొందరు తల్లిదండ్రులు సెలవులలో వారి బిడ్డలను వెంట తీసుకుని బతుకు విలువ నేర్పిస్తున్నారు. వారిని తప్పనిసరిగా అభినందించాలి. వారి పిల్లల జీవితాలను మార్చేందుకు ఇదే తొలిమెట్టుగా చెప్పవచ్చు.
– లక్ష్మీదేవమ్మ, విశ్రాంత ఉపాధ్యాయిని, తిరుపతి
బాధ్యత తప్పనిసరి
ఆధునికత పేరుతో చిన్నపిల్లలు సైతం స్మార్ట్‌ఫోన్లు, బెట్టింగ్ గేమ్స్, చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. పేరెంట్స్‌పై తిరగబడుతున్నారు. చదువును పూర్తిగా విస్మరిస్తున్నారు. ఈ దుస్థితి నుంచి యువతను గట్టెక్కించాలంటే ముందుగా తల్లిదండ్రులకు బాధ్యత తప్పనిసరి. చిన్ననాటి నుంచే కుటుంబ పరిస్థితితోపాటు కష్టం విలువ తెలియజేయాలి. గొప్పలకు పోకుండా బిడ్డలకు పైసా రాకపోకలపై అవగాహన కల్పించాలి.
– మునిరామయ్య,
విశ్రాంత ప్రభుత్వోద్యోగి, తిరుపతి

తల్లిదండ్రులను అభినందించాలి