
టీటీడీ అటానమస్ కళాశాలల డిగ్రీ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న అటానమస్ కళాశాలలో డిగ్రీ రెండవ సెమిస్టర్ ఫలితాలను సోమవారం ఎస్పీడబ్లూ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ టి నారాయణమ్మ, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ వేణుగోపాల్‌రెడ్డి విడుదల చేశారు. వారు మాట్లాడుతూ, గత నెల 28 నుంచి మే 7వ తేదీ వరకు అటానమస్ హోదాలో నిర్వహించిన డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఫలితాలను 20రోజులలోపే విడుదల చేయడం గర్వంగా ఉందన్నారు. ఫలితాల కోసం విద్యార్థులు కళాశాలల అధికారిక వెబ్‌సైట్‌లో, కళాశాల నోటీస్ బోర్డులో చూసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్వీ ఆర్ట్స్, ఎస్పీడబ్ల్యూ కళాశాలల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. కాగా ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో ఫలితాలను మరో నాలుగు రోజులలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.