
భూసేకరణ పనులు వేగవంతం
తిరుపతి అర్బన్: భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణకు సంబంధించి ఏదైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే వాటికి పరిష్కారం చూపుతామన్నారు. జాతీయ రహదారులతోపాటు రైల్వే ప్రాజెక్టుకు చెందిన భూసేకరణ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమావేశంలో తిరుపతి ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్‌భరత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మధుసూదన్‌రావు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ సురేంద్రనాయుడు, నేషనల్ హైవే పీడీలు చైన్నె, నెల్లూరు, తిరుపతి వరుసగా రవీంద్రరావు, వెంకటేశ్వర్లు, వెంకట చలపతి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
పారదర్శకంగా రేషన్ పంపిణీ
చంద్రగిరి: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న రేషన్ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పారదర్శకంగా ప్రజలకు పంపిణీ చేయాలని డీఎసీఓ శేషాచలరాజు ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి, డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ చేయనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపంపిణీ వ్యవస్థ అధికారులు మంగళవారం మండల పరిధిలోని ఎఫ్‌పీ దుకాణాలను తనిఖీ చేశారు. డీఎస్‌ఓతో పాటు ఇతర అధికారులు తనిఖీలు చేపట్టి, నిల్వ ఉన్న బియ్యంతోపాటు ఇతర నిత్యావసర సరుకులను పరిశీలించారు. అనంతరం వాటికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఎఫ్‌పీ దుకాణాల్లో ఆకస్మిక తనఖీలుంటాయని పేర్కొన్నారు. అరకొరగా పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందింతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సీఎస్ డీటీ గంగయ్య, పలువురు డీలర్లు పాల్గొన్నారు.
మోటార్ల చోరీ నియంత్రణ
ఏర్పేడు: మండలంలో తరచూ వ్యవసాయ పొలాల్లో రైతులకు చెందిన విద్యుత్ మోటార్లు, స్టార్టర్లు చోరీ జరుగుతుంటే వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు సీఐ శ్రీకాంత్‌రెడ్డిని ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఏర్పేడు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత పోలీసు స్టేషన్‌లోని వివిధ కేసులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకుని ఎప్పటి నుంచో శిథిలావస్థకు చేరుకున్న వాహనాలను కోర్టు అనుమతి తీసుకుని వాటిని వాహనదారులకు తిరిగి ఇచ్చేయడమో.. వేలం వేయడమో చేయాలన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 16 అంశాలతో కూడిన బోర్డును పరిశీలించారు. గ్రామాల్లో పల్లె నిద్ర నిర్వహించాలని ఆదేశించారు.

భూసేకరణ పనులు వేగవంతం

భూసేకరణ పనులు వేగవంతం