
కష్టాలు తప్పడం లేదు
గతంలో వ్యక్తిగత, గ్రామ సమస్యలను పరిష్కరించునేందుకు సచివాలయాలకు వెళ్లేవాళ్లం. ప్రసుత్తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సచివాలయంలో సిబ్బంది, వలంటీర్లు ఉండడం లేదు. అదేమని అడిగితే సర్వేలకు వెళ్లారని చెబుతున్నారు.
– తుపాకుల ప్రసాద్, మన్నారుపోలూరు
మీ సేవకు వెళ్లాం
మా అబ్బాయి ఓ ప్రయివేటు కళాశాలలో ఇంజినీరింగ్ చేస్తున్నాడు. వాడికి ఓబీసీ సర్టిఫికెట్ కావాలని అడిగారు. అన్ని వివరాలను తీసుకుని సచివాలయానికి వెళితే అక్కడ సిబ్బంది లేరు. కనీసం సమాచారం చెప్పే వారు కూడా లేరు. చివరకు ఓ వ్యక్తి మీ సేవకు వెళ్లమని సలహా ఇచ్చారు. గతంలో సచివాలయంలోనే సర్టిఫికెట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. – ఎం.రమేష్, సూళ్లూరుపేట
చేనేతలను ఆదుకునేవారు లేరు
గత ప్రభుత్వంలో నేతన్న నేస్తం పథకం ద్వారా ఏటా ఒక్కో కార్మికునికి రూ.24000 వచ్చేది. చేనేత క్లస్టర్ యూని ట్స్‌కు సబ్సిడీతో విద్యుత్ అందించేవారు. కూటమి సర్కార్ చేనేతలను ఆదుకునే దిశగా ఒక్క పథకమూ అమలు చేయలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాం.
–శ్రీనివాసులు, చేనేత కార్మికుడు, వెంకటగిరి
వైద్యం అందడం లేదు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చి వాటిని నిర్వీర్యం చేసింది. అందులో పనిచేస్తున్న సీహెచ్‌ఓలకు వేతనాలు ఇవ్వకుండా వేధిస్తోంది. నెల రోజులకు పైగా విలేజ్ హెల్త్ క్లినిక్‌లు మూతపడ్డాయి. రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
–ఓడూరు ఉజ్వల్ రెడ్డి, బత్తలవల్లం,
వరదయ్యపాళెం మండలం
●

కష్టాలు తప్పడం లేదు

కష్టాలు తప్పడం లేదు

కష్టాలు తప్పడం లేదు