
● వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్న తల్లిదండ్రులు
పిల్లలకు తెలియాలి
మాది చిత్తూరు జిల్లా పూతలపట్టు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. రోజూ తిరుపతికి వచ్చి తాటిముంజెలు అమ్ముతుంటా. మా అబ్బాయి 8వ తరగతి పూర్తి చేసుకుని 9లోకి వెళుతున్నాడు. వచ్చేనెల పాఠశాల ప్రారంభం అవుతుంది. ఫీజు కట్టాలి.. పుస్తకాలు.. దుస్తులు కొనాలి. ఇందుకోసం నేను ఏం చేస్తున్నానో నా బిడ్డకు తెలియాలి. డబ్బు ఎలా వస్తుంది..అనే విషయం పిల్లలకు తప్పకుండా తెలియాలి. వేసవి సెలవులలో ఇంటి దగ్గర వదిలేస్తే విచ్చలవిడిగా తిరుగుతుంటారు. అందుకే ప్రతి రోజూ నాతోపాటు తీసుకువస్తున్నా. తాటి ముంజెలు అమ్మడంలో నా కష్టాన్ని నేరుగా చూస్తున్నాడు. భవిష్యత్‌లో మానాన్న లాగా కష్టపడకూడదు అనుకోవాలి.. బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలనే కోరిక కలగాలి.
– విద్యార్థి జీవన్ కుమార్‌తో తండ్రి మధు,
తాటి ముంజెల వ్యాపారి

● వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్న తల్లిదండ్రులు