
రాజకీయాలు మానుకోవాలి
రైతు సేవా కేంద్రాల నిర్వహణపై కూటమి ప్రభుత్వం రాజకీయాలు మానుకోవాలి. రైతులకు ప్రయోజనం చేకూర్చే విషయంలో ఉదారంగా వ్యవహరించాలి. క్లస్టర్ల కింద వాటిని మరింత తగ్గించాలని యత్నించడం అన్యాయం. వెంటనే ఇలాంటి నిర్ణయాలను ఉపసంహరించుకుంటే మంచిది. – వెంకటేష్, రైతు
మంచిది కాదు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కారించాలనే ఉద్దేశంతో ఆర్బీకేలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు వాటిని కుదించాలనుకోవడం మంచిది కాదు. గతంలో మాదిరిగానే ఆర్ఎస్కేల నుంచి విత్తనాలు, ఎరువులు, ఇతర పరికరాలను అందించాలి. లేకుంటే రైతులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – శేఖర్, రైతు
ఇబ్బందులు తప్పవు
రైతు సేవా కేంద్రాలు ఉపయోగకరం. గత వైఎస్సార్సీపీ సర్కార్ ప్రతి గ్రామంలో ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకవచ్చింది.తాజాగా కూటమి ప్రభు త్వం క్లస్టర్ల పేరుతో నాలుగు నుంచి ఐదుకేంద్రాలను ఒక్కటిగా చేయడం సరికాదు. దాంతో ఐదు గ్రామాల వారు ఒకే చోటుకు వెళ్లాల్సివస్తుంది. దీంతో ఇబ్బందులు తప్పవు. – నరేంద్రయాదవ్, రైతు

రాజకీయాలు మానుకోవాలి

రాజకీయాలు మానుకోవాలి