
బదిలీల కోసం టీచర్ల నిరసన
తిరుపతి అర్బన్ : ఉపాధ్యాయులకు బదిలీలతోపాటు ఉద్యోగోన్నతులు కల్పించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శలు డీజే రాజశేఖర్, ముత్యాల రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు కలెక్టరేట్ వద్ద టీచర్లతో కలిసి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ 117 జీవోను రద్దు చేయాలని కోరారు. ప్రాధమిక పాఠశాలల్లో 1ః20 నిష్పత్తిలో ఉపాధ్యాయుల నియామకాలు ఉండాలని సూచించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమణకు వినతిపత్రం సమర్పించారు. యూటీఎఫ్ నేతలు దండు రామచంద్రయ్య, కుమారస్వామి, గీతమ్మ, మోహన్ బాబు, సూర్య ప్రకాష్, బండి మధుసూదన్‌రెడ్డి, సురేష్, మస్తానయ్య, పద్మజ, హేమంబరధరరావు, ఆదినారాయణ, గోవర్ధన రెడ్డి పాల్గొన్నారు.