
కక్ష సాధింపు చర్యలు మంచి పద్ధతి కాదు
సైదాపురం: కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై ప్రశ్నిస్తున్న సాక్షి పత్రికపై కక్ష సాధింపు చర్యలు మంచి పద్ధతి కాదని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కేసులు నమోదు చేయడం, ఇంట్లో అక్రమ సోదాలు వంటి అప్రజాస్వామ్మకమైన చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. సాక్షి దినపత్రిక గొంతు నొక్కే ప్రయత్నంగా ఏడిటర్‌పై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు అర్థమవుతోందని చెప్పారు.
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు గడువు నేటితో ఆఖరు
తిరుపతి అర్బన్: ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తులు చేసుకోవడానికి శనివారంతో గడువు ముగుస్తుందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వర్చువల్ పద్ధతిలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 20వ తేదీకల్లా అర్హులైన వారికి రుణాలు ఇవ్వాన్నారు. ఇప్పటి వరకు 1,267 యూనిట్లకు 5,600 దరఖాస్తులు వచ్చాయన్నారు. మొత్తం రూ.53 కోట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఇందులో సబ్సిడీ రూ.21 కోట్లని పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చెన్నయ్య పాల్గొన్నారు.
రేపటితో ఏపీ పీజీసెట్ దరఖాస్తుకు ఆఖరు
తిరుపతి సిటీ: ఏపీ పీజీసెట్–2025 దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారంతో ముగియనుంది. ఈనెల 5వ తేదీతో ముగిసిన గడువును విద్యార్థుల అభ్యర్థన మేరకు ఆ నెల 11వ తేదీ వరకు పొడిగించారు. అలాగే రూ.1000 అపరాధరుసుముతో ఈనెల 15వ తేదీ వరకు, రూ.2 వేలు అపరాధ రుసుముతో 20 వరకు, రూ.4వేల అపరాధ రుసుముతో 24వ తేదీ వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో 25వ తేదీవరకు అవకాశం ఉంటుందని కన్వీనర్ ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్ ద్వారా ఏపీపీజీ సెట్‌కు 24 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 22 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,850 మంది స్వామివారిని దర్శించుకోగా 28,816 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది.

కక్ష సాధింపు చర్యలు మంచి పద్ధతి కాదు

కక్ష సాధింపు చర్యలు మంచి పద్ధతి కాదు