
పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
తిరుపతి అర్బన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్వో నరసింహులు సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన పరీక్షల నిర్వాహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు 64 కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 30,182 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్టు తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయన్నారు.