‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
సాక్షి ఎడిటర్ నివాసంలో సోదాలు మండిపడిన జిల్లాలోని జర్నలిస్టులు
జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు
విజయవాడలో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో పోలీసుల సోదాలపై జిల్లాలోని జర్నలిస్ట్‌లు కదం తొక్కారు. అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు మిన్నంటించారు. ఇది ప్రజాస్వామ్యమా.. పోలీసు రాజ్యమా.. అంటూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే వీధి పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఉన్నతంగా ఆలోచన చేయాలి
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జర్నలిస్టుల అంశంపై ఉన్నతంగా ఆలోచన చేయా ల్సి ఉంది. పత్రికలో వచ్చిన కథనంపై ప్రభుత్వాలు స్పందించి ఆ సమస్యను సరి చేయాల్సి ఉంది. అంతే తప్ప తమకు వ్యతిరేకంగా కథనాలు వస్తే వారిని భయాందోళనకు గురిచేయడం సమాజానికి మంచిది కాదని మా ఉద్దేశ్యం.
– మురళి, తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు
నెల రోజుల్లోనే మూడు సార్లు దాడులు
నెల రోజుల వ్యవధిలోనే ఓ పత్రికపై మూడు సార్లు కక్ష పూరితంగా దాడులు చేయడం బాధాకరం. ఓ వైపు పత్రికా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. మరో వైపు జర్నలిస్టులపై భౌతిక దాడులు చేపడుతున్నారు. ఎడిటర్ స్థాయి వ్యక్తుల ఇంట్లో పోలీసులు సోదాలు ఎంటి?.
– మబ్బు నారాయణరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి
కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
ఎడిటర్ స్థాయిలో పనిచేస్తున్న ఓ వ్యక్తి నివాసంలో పోలీసులు చొరబడి తనిఖీ లు చేయాల్సిన అవసరం ఎంటో. కక్ష సాధింపు చర్య లు మంచి పద్ధతి కాదు. ప్రధానంగా జర్నలిస్టులుపై కుట్రలు చేయడం, దాడులు చేయడం లాంటివి మానుకోవాలి.
– విజయయాదవ్, జాప్ జిల్లా అధ్యక్షులు
కొత్త పద్ధతికి శ్రీకారమా?
కొత్త పద్ధతికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తమకు ఇష్టం లేని కథనం వస్తే జర్నలిస్ట్‌పై దాడి చేస్తే.. మరోసారి వ్యతిరే కథనాలు రావనుకోవడం అవివేకం. పత్రికలు మంచి, చెడు రెండింటినీ ప్రచురించడం సహజం.
– లోకేష్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్