
లీజు ముగిసిన గనులను స్వాధీనం చేసుకోవాలి
సైదాపురం: మండలంలో లీజు ముగిసిన గనులను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర కృత్య అకాడమీ మాజీ చైర్ పర్సన్ పొట్టేళ్ల శిరీషాయాదవ్ కోరారు. ఆమె గురువారం నెల్లూరు ఆర్డీవో అనూషకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. భారత గనుల మంత్రిత్వ శాఖ క్వార్‌ట్ట్ ్జ ఖనిజాన్ని మేజర్ మినరల్‌గా ప్రకటించిందన్నారు. ఈ క్రమంలో గనులు, ఖనిజాలు అభివృద్ధి, నియంత్రణ చట్టం 1957 ప్రకారం ఇక్కడ ఎటువంటి అక్రమ మైనింగ్ జరగకూడదన్నారు. నెల్లూరు ఎంపీ తన అనుచరుడితో అక్రమ మైనింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే గనులను స్వాధీనం చేసుకుని మైనింగ్ జరగకుండా చూడాలని కోరారు.
13న విభిన్న ప్రతిభావంతులకు జాబ్ మేళా
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుచానూరు రోడ్డు, పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో గల ఉప ఉపాధి కార్యాలయంలో ఈ నెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు విభిన్న ప్రతిభావంతులకు జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఆ మేరకు జూనియర్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ ఎస్.వెంకటరమణ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళాలో ఎస్‌ఆర్‌కేర్, జాగృతి ఎస్‌ఆర్ సర్వీసెస్, కేఎఫ్‌సీ సంస్థల ప్రతినిధులు పాల్గొని ఆయా సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. పది పాస్/ఫెయిల్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ విద్యార్హత కలిగి 18 నుంచి 30 ఏళ్లలో ఉన్న సీ్త్ర, పురుషులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు పూర్తి బ యోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లతో జాబ్‌మేళాకు హాజరవ్వాలని, మరిన్ని వివరాలకు 9392923 884లో సంప్రదించాలని తెలిపారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌సీఎస్.జీఓవీ.ఇన్’’ అనే వెబ్‌సైట్లో తమ పూర్తి వివరాల ను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 8 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 71,001 మంది స్వామివారిని దర్శించుకోగా 28,637 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.25 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
సీనియారిటీ జాబితా విడుదల
చిత్తూరు కలెక్టరేట్ : జోన్–4 పరిధిలోని చిత్తూరు జిల్లా గవర్నమెంట్ మేనేజ్‌మెంట్ స్కూల్ అసిస్టెంట్ కేడర్ నుంచి గ్రేడ్ 2 హెచ్‌ఎం ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితా విడుదల చేసినట్లు వైఎస్సార్ కడప జిల్లా ఆర్జేడీ శామ్యూల్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జోన్–4 పరిధిలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ మేనేజ్‌మెంట్‌లో స్కూల్ అసిస్టెంట్ తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేశామన్నారు. ఈ జాబితా www.rjdrekadapa.bofrpot.com లో నమోదు చేసినట్లు తెలిపారు. సంబంధిత జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 10వ తేదీలోపు తగిన ఆధారాలతో చిత్తూరు డీఈఓ కార్యాలయంలో అందజేయాలన్నారు.
డీపీటీఓ బాధ్యతల స్వీకరణ
తిరుపతి అర్బన్: జిల్లా ప్రజారవాణా అధికారి (డీపీటీఓ)గా వెంకట్రావ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా నుంచి ఆయన బదిలీపై జిల్లాకు విచ్చేశారు. ఇక్కడ డీపీటీవోగా పనిచేస్తున్న నరసింహులు ఏప్రిల్ 30న ఉద్యోగ విరమణ పొందారు. ఈ క్రమంలో వెంకట్రావ్‌ను తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు.
ఏపీపీఎస్సీ పరీక్షలకు
608 మంది హాజరు
తిరుపతి అర్బన్: జిల్లాలో ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ రాత పరీక్షకు గురువారం 608 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 911 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. వారిలో 303 మంది గైర్హాజరైనట్టు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.

లీజు ముగిసిన గనులను స్వాధీనం చేసుకోవాలి