తిరుపతి సిటీ: ఆధునిక ప్రపంచంలో విద్య, ఉపాధి రంగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ప్రభావం కీలకంగా మారుతోందని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి భవానీ శంకర్ పేర్కొన్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి మండలి, మై క్రోసాఫ్ట్ సంయుక్త సహకారంతో పద్మావతి మహిళా వర్సిటీ డీఎస్‌టీ క్యూరీ ఏఐ సెంటర్ ఆధ్వర్యంలో వర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మూ డు రోజుల పాటు మైక్రోసాఫ్ట్ ఏఐ, నైపుణ్యాభివృద్ధి అనే అంశంపై జరగనున్న వర్క్‌షాప్‌ను ఆయన వర్సి టీ అధికారులు, అతిథులతో కలసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంప్రదాయ, ఆన్ లైన్ ద్వారా విద్యనభ్యసించడానికి రిమోట్ లెర్నింగ్‌కు తేడా ఉందన్నారు. సాంకేతిక విద్యతో విద్యార్థులను సాధికారపరచడం కోసం ఉమెన్ రాక్ ఇన్ ఐటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం సాంప్రాసాఫ్ట్ సంస్థ సీఈఓ మల్లిక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అంతటా 50 వేల మంది విద్యార్థులకు ఏఐ పై శిక్షణ ఇవ్వాలన్న అంశంపై మైక్రోసాఫ్ట్ సంస్థ దృష్టి సారించిందన్నారు. ప్రపంచ ఉద్యోగ వీసీ ప్రొఫెసర్ ఉమ మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవాలంటే విద్యతో పాటు ఏఐపై విద్యార్థినులు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ టి సుధ, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డైరెక్టర్ మల్లికార్జున, ప్రొఫెసర్ వెంకటకృష్ణ పాల్గొన్నారు.