తిరుపతి అర్బన్: ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, అనలిస్ట్ గ్రేడ్–ఐఐ పోస్ట్‌లు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్ట్‌లకు సంబంధంచిన పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు డీఆర్వో నరసింహులు తెలిపారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. పరీక్షలు నేటి నుంచి మూడు రోజుల పాటు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో రెండు సెంటర్లలో 2,080 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్టు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు పద్మలలిత, శివప్రసాద్ పాల్గొన్నారు.
విభిన్న ఆలోచనే
ఆవిష్కరణకు నాంది
ఏర్పేడు(రేణిగుంట) : విభిన్న ఆలోచనే నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతుందని తిరుపతి ఐజర్ డైరెక్టర్ సంతాను భట్టాచార్య తెలిపారు. సోమవారం ఏర్పేడు మండలం జంగాలపల్లె సమీపంలోని ఐజర్‌లో ఐదు రోజులపాటు జరగనున్న ఫ్యాకల్టీ ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ఆయ న ప్రారంభించారు. డైరెక్టర్ మాట్లాడుతూ దేశ జనాభా ప్రయోజనాలను ఆవిష్కరణలుగా మా ర్చాలని సూచించారు. ప్రొఫెసర్ విజయమోహనన్ కె.పిళ్లై, ఎస్‌ఎస్‌ఐఐఈ సీఈఓ డాక్టర్ జె.సూర్య కుమార్, జీనోమ్ వ్యాలీలోని ఐకేపీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విశ్వనాథం దుప్పట్ల పాల్గొన్నారు.