– 15 మంది గాయాలు
వెంకటగిరి రూరల్ : రేణిగుంట సెజ్‌లోని కార్బన్ లియోలింక్ కంపెనీకి చెందిన బస్సు వెంకటగిరి పరిసర ప్రాంతాలకు చెందిన తమ ఉద్యోగులతో వెళుతూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఆదివారం వేకువజామున శ్రీకాళహస్తి రూరల్ మండలం ఎంపేడు గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొన్నట్లు . శ్రీకాళహస్తి రూరల్ ఎస్‌ఐ నరసింహారావు వెల్లడించారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ మునేంద్రతోపాటు, రాపూరుకి చెందిన యశోద, వెంకటగిరికి చెందిన కుషల్, గొట్లగుంటకు చెందిన ప్రసాద్, లింగసముద్రానికి చెందిన శివాజీతోపాటు మొత్తం 15 మంది గాయపడ్డారు. రాయచోటికి చెందిన లారీ క్లీనర్ రాజు సైతం తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రులను 108 వాహనంలో వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు మెరుగైన చిక్సి కోసం తిరుపతికి తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్‌ఐ వివరించారు.