నేడు సూళ్లూరుపేటకు చేరుకోనున్న సైక్లోథాన్‌ యాత్ర | - | Sakshi
Sakshi News home page

నేడు సూళ్లూరుపేటకు చేరుకోనున్న సైక్లోథాన్‌ యాత్ర

Mar 24 2025 6:48 AM | Updated on Mar 24 2025 6:48 AM

సూళ్లూరుపేట : కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌) చేపట్టిన సైక్లోథాన్‌ యాత్ర సోమవారం ఉదయం సూళ్లూరుపేటకు చేరుకోనుంది. అక్కడి నుంచి 9 గంటలకు తడ మండలం అండగుండాల, కారిపాకం వెళ్లే రోడ్డులో ఉన్న జైన్‌ మందిరం వద్దకు చేరుకుంటుంది. శ్రీజాతీయ తీర ప్రాంతాల భద్రత, సమాజ నిబద్ధతశ్రీ అనే అంశంపై జనానికి అవగాహన కల్పించేందుకు సుమారు వంద మంది సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బంది 9 రాష్ట్రాల మీదుగా 6,553 కి.మీ సైకిల్‌ యాత్రను చేపట్టారు. ఈ యాత్రను ఈనెల 7న కోలకత్తాలో కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్‌షా ప్రారంభించారు. ఈ యాత్ర ఏప్రిల్‌ 1 నాటికి కన్యాకుమారిలో ముగియనుంది. సోమవారం సూళ్లూరుపేట ఈ యాత్రకు శ్రీహరికోట రాకెట్‌ కేంద్రంలోని సీఐఎస్‌ఎఫ్‌ ఽభద్రతా సిబ్బంది స్వాగతం పలకనున్నారు. కార్యక్రమానికి షార్‌ డైరెక్టర్‌, కంట్రోలర్‌, సీఐఎస్‌ఎఫ్‌ ఐజీ సౌత్‌ సెక్టార్‌, డీఐజీ, స్థానిక పోలీస్‌ అధికారులు, ఎన్‌సీసీ క్యాడెట్స్‌, విద్యార్థులు హాజరుకానున్నారు.

నాయుడుపేటకు చేరుకున్న సైక్లోథాన్‌ ర్యాలీ

నాయుడుపేట టౌన్‌: కోల్‌కత్తా నుంచి ప్రారంభమైన సీఐఎస్‌ఎఫ్‌ కోస్టల్‌ సైక్లోథాన్‌ ర్యాలీ ఆదివారం సాయంత్రం నాయుడుపేట మండల పరిధిలోని బిరదవాడ గ్రామ సమీపంలోని శ్రీనివాసపురం వద్దకు చేరింది. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబుతో పాటు సీఐ బాబి, ఎస్‌ఐ ఆదిలక్ష్మి, పాఠశాల విద్యార్థులు, మహిళలు సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌లపై ఘన స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement