దొరవారిసత్రం: చైన్నె నుంచి నెల్లూరుకు వెళ్లే మెమో రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడడంతో శుక్రవారం సాయంత్రం 4.20 గంటల ప్రాంతంలో దొరవారిసత్రం రైల్వే స్టేషన్‌కు సమీపంలో డౌన్‌లైన్ పట్టాలపై 99 కి.మీ వద్ద అవుటర్‌లో ఆగిపోయింది. అదే సమయంలో వెనుకనే బెంగళూరు నుంచి వయా చైన్నె మీదుగా వచ్చిన ధనాపూర్ ఎస్స్‌ప్రెస్ దొరవారిసత్రం రైల్వే స్టేషన్‌లో 4.40 గంటలకు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఎండ తీవ్రతకు అల్లాడిపోయారు. మెమో రైల్లోని ప్రయాణికులు మాత్రం జాతీయ రహదారి బాట పట్టి ఎవరి పాటికి వారు ఆయా ప్రాంతాలకు వెళ్లిపోయారు. రాత్రి 7.10 గంటలకు గూడూరు నుంచి ఇంజిన్ రావడంతో మెమో రైలు కదిలింది. వెనుకనే దనాపూర్ ఎస్స్‌ప్రెస్ కూడా కదిలింది.
ఆగిపోయిన మెమో రైలు