గని కార్మికులపై కూటమి కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

గని కార్మికులపై కూటమి కన్నెర్ర

Mar 22 2025 12:27 AM | Updated on Mar 22 2025 12:27 AM

గని క

గని కార్మికులపై కూటమి కన్నెర్ర

● మూత పడిన క్వార్ట్జ్‌ గనులు ● తొమ్మిది నెలలుగా ఇదే తంతు ● పనుల్లేక డొక్కలు మాడ్చుకుంటున్న పేదలు ● బోణీల్లేవంటున్న అంగడి యజమానులు

రెక్కాడితే గానీ డొక్కాడని గని కార్మికులపై కూటమి ప్రభుత్వం కక్ష గట్టింది. మైకా,

క్వార్ట్జ్‌, క్వారీ పరిశ్రమలకు

అనుమతులివ్వకుండా వేధిస్తోంది.

తొమ్మిది నెలలుగా చేతినిండా పనిలేక పేదలు పస్తులతో కాలం గడపాల్సి వస్తోంది. గనుల్లో వాచ్‌మన్‌ దగ్గర నుంచి జేసీబీ, ప్రొక్లెయిన్‌, ట్రాక్టర్లు, టిప్పర్లు, కార్మికులు ఇలా ఎందరో అర్ధాకలితో అలమటించాలి వస్తోంది. వీరిపై ఆధారపడిన పలు దుకాణాలు సైతం

బోసిపోవడం సైదాపురంలో నిత్యకృత్యంగా మారుతోంది.

కార్మికులు లేక బోసిపోయిన మైకా గని ప్లాంట్‌

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని సైదాపురం మండలంలో కోట్లాది రూపాయాల గనులు, మైకా గనులు ఉన్నాయి. ఇక్కడ అపారమైన ఖనిజ నిక్షేపాలున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇవ్వన్నీ మూతపడ్డాయి. నూతన పాలసీ పేరిట వీటిని మూసివేశారు. ఆ తర్వాత జూన్‌ 12 నుంచి మైకా పరిశ్రమలన్నీ సిండికేట్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కొన్ని గనుల్లో పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. మిగిలినవి పూర్తిగా మూతపడ్డాయి. ఫలితంగా వీటిపై ఆధారపడ్డ ఐదు వేల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయాయి. కార్మికులకు ఉపాధి లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నా అధికారులు కనికరం చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అందరిపైనా ప్రభావం

గడిచిన తొమ్మిది నెలల్లో పల్స్‌పర్‌, మైకాకే పర్మిట్లు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం వాటిల్లోనూ తూతూమంత్రంగానే పనులు జరుగుతున్నాయి. ఈ సంక్షోభం కార్మికులపైనే కాకాకుండా యాజమాన్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోవడంతో మైకా పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది.

ఆశలు.. అడియాశలు

సైదాపురం, పొదలకూరు, గూడూరు మండలాల్లోని కార్మికులు అధికం మైకా గనులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తొమ్మది నెలలుగా పనుల్లేక ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. మరో వైపు గని కార్మికుల్లో అధిక శాతం కూటమి ప్రభుత్వానికే ఓటు వేశారు. గతానికి భిన్నంగా గత ఎన్నికల్లో సైదాపురం మండలంలో కూటమి ప్రభుత్వానికి భారీ మెజారిటీ వచ్చింది. తమకు మంచి జరుగుతుందనే వీరి ఆశలు అడియాశలయ్యాయి. మైకా పరిశ్రమలకు వెళ్లే కూలీలతో కళకళలాడే సైదాపురం నేడు బోసిపోయింది. రవాణా వ్యవస్థ స్తంభించింది. వాహన యజమానులతో పాటు లోడింగ్‌చేసే కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పలువురు కార్మికులు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగుతున్నారు.

వాటికి అనుమతి ఎప్పుడో?

మైకా పరిశ్రమ పూర్తిగా ఓ ముఖ్యనేత కనుసన్నల్లోకి వెళ్లిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం సదరు వ్యక్తికి అప్పజెప్పడంతో ఈ రంగం కుదేలైంది. ప్రధానంగా గిద్దలూరు, కలిచేడు గ్రామాల్లో ఉన్న రెండు ప్రధాన గనులకు నేటికీ అనుమతులు లభించలేదు. వీటిపై ఆధారపడిన వేలాది మంది కూలీలు వీధిన పడ్డారు.

143 నుంచి 80కి

మండలంలో గతంలో 143 గనులు పనిచేస్తుండగా ప్రస్తుత వీటి సంఖ్య 80కి పడిపోయింది. అందుబాటులో ఉన్న గనులు, క్వారీలకు అనుసంధానంగా పది ఫ్యాక్టరీలున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 15 వేల మంది, పరోక్షంగా మరో 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. వీటిలో 90 శాతం మంది జిల్లా వాసులే.

గని కార్మికులపై కూటమి కన్నెర్ర 
1
1/2

గని కార్మికులపై కూటమి కన్నెర్ర

గని కార్మికులపై కూటమి కన్నెర్ర 
2
2/2

గని కార్మికులపై కూటమి కన్నెర్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement