తిరుపతి సిటీ : ఆరోగ్య రక్షణలో చిరుధాన్యాలు కీలకపాత్రం పోషిస్తాయని ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.కలీముల్లా తెలిపారు. శుక్రవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో శ్రీచిరుధాన్యాలపై అవగాహన, ప్రాసెసింగ్ యంత్రాల సందర్శన్ఙ అనే అంశంపై 25 మంది ఎస్సీ మహిళలకు శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిరుధాన్యాలు తీసుకుంటే శరీరానికి పోషకాలు పుష్కలంగా అందుతాయని చెప్పారు. అనంతరం చిరుధాన్యాలను శుద్ధి చేయడం, పొట్టు తీయడం, తినుబండారాల తయారీపై మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఏడీఆర్ డాక్టర్ వి.సుమతి మాట్లాడుతూ చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే రక్తపోటు, చక్కెర వ్యాధి, అధిక కొవ్వును అరికట్టవచ్చని వెల్లడించారు. అనంతరం మహిళలకు కిట్, సర్టిఫికెట్లతో పాటు తినుబండారాలను పంపిణీ చేశారు.