శ్రీసిటీ (వరదయ్యపాళెం): పరిశ్రమల్లో అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటించిన శ్రీసిటీలోని మూడు పరిశ్రమలకు ‘2024 సీఐఐ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డ్స్’ దక్కాయి. విశాఖపట్నం నోవోటెల్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ మాదిరెడ్డి ప్రతాప్ ఈ అవార్డులను అందజేశారు. శ్రీసిటీకి చెందిన మొండెలెజ్ ఇండియా, కెలాగ్స్, డానియెలి కంపెనీలు ఈ పురస్కారాలను అందుకున్నాయి. ఇందులో మొండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇండస్ట్రియల్ సేఫ్టీ లీడర్‌షిప్ అవార్డ్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ విభాగంలో బంగారు పతకం దక్కింది. 2024 సంవత్సరానికి బెస్ట్ సేఫ్టీ పర్ఫార్మర్‌గా ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో గోల్డ్ అవార్డును కెల్లాగ్స్ అందుకుంది. ఇక డానియెలి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇండస్ట్రియల్ సేఫ్టీ లీడర్‌షిప్ అవార్డ్ కింద ఇంజినీరింగ్ విభాగంలో గోల్డ్ పురస్కారం సొంతమైంది. విజేతలకు అభినందనలు తెలిపిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఈ అవార్డులు భద్రతా ప్రమాణాలను పాటించడంలో ఆ పరిశ్రమల అంకితభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. సీఐఐ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ చైర్మన్ డా.మురళీకృష్ణ హాజరయ్యారు.
శ్రీసిటీ కంపెనీలకు ప్రతిష్టాత్మక సీఐఐ అవార్డులు
శ్రీసిటీ కంపెనీలకు ప్రతిష్టాత్మక సీఐఐ అవార్డులు