
చింతగుంట సచివాలయంపై దాడి
చిన్నగొట్టిగల్లు (ఎర్రావారిపాళెం) : ఎర్రావారిపాళెం మండలం చింతగుంట పంచాయతీలో గ్రామ సచివాలయం అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. గత ప్రభుత్వంలో నిర్మించిన గ్రామ సచివాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి పూట రాళ్లతో దాడి చేసి, సచివాలయం అద్దాలు ధ్వంసం చేసి పరారయ్యారు. ఉదయం యథావిధిగా సచివాలయానికి చేరుకున్న సిబ్బంది పగిలిన అద్దాలు చూసి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి హేమలత ఎర్రావారిపాళెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సైబర్ నేరంపై పోలీసుల విచారణ
కోట:విద్యానగర్‌లో చోటుచేసుకున్న సైబర్ నేరంపై పోలీసులు మంగళవారం విచారణ జరిపారు. ఎస్‌ఐ పవన్‌కుమార్ కథనం మేరకు.. విద్యానగర్ లో ఎస్‌బీఐ సేవా కేంద్రం నడుపుతున్న మోహన్ వద్దకు గత శనివారం ఓ వ్యక్తి వచ్చి తన అకౌంట్ నుంచి రూ.40 వేల డబ్బులు కావాలన్నాడు. ప్రా థేయపడడంతో సరే అన్నాడు. వచ్చిన వ్యక్తి మరో మహిళతో ఫోన్ కలిపి తన అక్క లైన్‌లో ఉందని మీ ఫోన్‌పే నంబర్ చెబితే దానికి డబ్బులు వేస్తుందని చెప్పాడు. ఆమెతో ఫోన్‌లో మాట్లాడిన మోహ న్ ఫోన్‌పే నంబర్ చెప్పాడు. ఆమె ఆ అకౌంట్‌కు రూ.40 వేలు వేసింది. వెంటనే మోహన్ అతనికి నగదు ఇచ్చేశాడు. 10 నిమిషాల తరువాత విజయవాడకు చెందిన రమ్య అనే మహిళ మోహన్‌కు ఫోన్ చేసి తను వేసిన రూ.40 వేలు వెనక్కి ఇచ్చేయాలని కోరింది. తన తమ్ముడు అనుకుని డబ్బు లు వేశానని, ఫోన్ చేసింది తన తమ్ముడు కాదని చెప్పింది. దీనిపై రమ్య తన భర్తతో కలసి విజయవాడ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కోట ఎస్‌ఐకు ఫోన్ చేసి దీనిపై విచారణ జరపాలన్నారు. కోట పోలీసులు మోహన్ దగ్గర డబ్బులు తీసుకువెళ్లిన వ్యక్తి ఎవరు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. రమ్యతో తన తమ్ము డు గొంతుతో మాట్లాడిన ఫోన్ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తి చైన్నె అడ్రస్‌తో ఉన్నట్లు గుర్తించారు. విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
సారా నిర్మూలనకు సమష్టి కృషి
తిరుపతి అర్బన్: సారా నిర్మూలనకు సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్థన్‌రాజు, జేసీ శుభం బన్సల్ పేర్కొన్నారు. కలె క్టరేట్‌లో మంగళవారం సారా నిర్మూలనకు ఎకై ్స జ్‌తోపాటు పలు విభాగాలకు చెందిన అధికారు లతో కలెక్టర్, ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సారా నివారణకు సంబంధించి న వోదయ 2.0 పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంత రం వారు మాట్లాడుతూ గ్రామసభలు నిర్వహించి, అవగాహన కల్పించాలని ఆదేశించారు. సారా నేరస్తులపై బైండ్ ఓవర్ కేసులు నమోదుతోపాటు రూ.లక్ష జరిమానా విధించాలన్నారు. 3 నెలల్లో తిరుపతిని సారారహిత జిల్లాగా ప్రకటించేలా మా ర్పులు తీసుకురావాలన్నారు. జిల్లా ఎక్సైజ్ డిప్యూ టీ కమిషనర్ విజయశేఖర్,ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసాచారి, తిరుపతి జిల్లా ఎకై ్సజ్ సూ పరింటెండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచ్చారి, డీపీఓ సుశీలాదేవి, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, సీపీఓ మునిచంద్రారెడ్డి పాల్గొన్నారు.

చింతగుంట సచివాలయంపై దాడి