వృక్ష సంపదపై అధ్యయనం | - | Sakshi
Sakshi News home page

వృక్ష సంపదపై అధ్యయనం

Mar 17 2025 12:26 AM | Updated on Mar 17 2025 12:26 AM

వృక్ష సంపదపై అధ్యయనం

వృక్ష సంపదపై అధ్యయనం

తిరుపతి సిటీ : ఎస్వీయూ వృక్షశాస్త్ర విభాగం విద్యార్థులు మూడు రోజుల పశ్చిమ కనుమల వృక్ష సంపద, జీవ వైవిధ్యం అధ్యయన యాత్రకు శ్రీకారం చుట్టారు. అధ్యాపకులు నాగలక్ష్మి, దేవమ్మ, కామాక్షమ్మ, వేణు, అంకన్న పర్యవేక్షణలో, విద్యార్థులు రూపేష్‌, శివాని నేతృత్వంలో యాత్ర చేపట్టారు. ప్రధానంగా కేరళలోని హొగెనెకల్‌ జలపాతం, టీ ఫ్యాక్టరీ, థ్రెడ్‌ గార్డెన్‌, రోజ్‌ గార్డెన్‌, నేషనల్‌ బొటానికల్‌ గార్డెన్‌, ఊటీ కొండలు, అతిరేపల్లి వాటర్‌ఫాల్స్‌ వంటి ప్రదేశాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లోని వృక్షసంపదను అధ్యయనం చేశారు. అధ్యాపకులు మాట్లాడుతూ వైవిధ్యమైన మొక్క భాగాలను విద్యార్థులు సేకరించారని, వాటిని హెర్బెరియం షీట్‌ల ద్వారా నిల్వ చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం యాత్ర ముగించుకుని వర్సిటీకి చేరుకోనున్నట్లు తెలిపారు.

తిరుచ్చిపై సూర్యనారాయణుడు

తిరుపతి రూరల్‌ : తిరుచానూరు పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీసూర్యనారాయణస్వామివారు ఆదివారం బంగారు తిరుచ్చిపై విహరించారు. స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు సమర్పించారు. సాయంత్రం సూర్య నారాయణ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచ్చిపై కొలువు దీర్చారు. అనంతరం తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ ప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్లు సుభాస్కర్‌ నాయుడు, చలపతి, సుబ్బారాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement