విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్‌పై పట్టు పెంపొందించేందుకు సాక్షి మీడియా గ్రూప్ మ్యాథ్స్ బీ, స్పెల్ బీ పరీక్ష చేపట్టింది.
తోడుగా నిలుస్తూ..!
పాకాల మండలంలో మృతి చెందిన పలువురికి తుడా చైర్మన్ మోహిత్‌రెడ్డి నివాళులర్పించారు.
– 8లో
● వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి చెందిన కాటన్ మిల్లు స్థలం నుంచి 4,793 చదరపు గజాలను మాస్టర్ ప్లాన్ రోడ్డు కోసం సేకరించారు. ఎన్నో ఏళ్ల నుంచి పారిశ్రామిక స్థలంగా ఈ భూమి చలామణి అవుతున్న విషయం అందరికీ విధితమే. అయితే టీడీపీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి అసత్యాలకు వంత పాడుతూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారానికి తెగబడింది. ఇండస్ట్రియల్ ఏరియా స్థలాన్ని వ్యవసాయ భూమిగా చూపుతూ ప్రజాప్రతినిధులపై అవాస్తవ ఆరోపణలతో కథనాలను వండి వార్చింది. నిబంధనల మేరకు సేకరించిన 4,793 చదరపు గజాలకు సబ్‌రిజిస్ట్రార్ విలువ ప్రకారం నాలుగు రెట్లు కేటాయిస్తూ టీడీఆర్ బాండ్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) అందిస్తే.. ప్రజలను గందగోళపరిచేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది.
● తిరుపతి రేణిగుంట రోడ్డులోని హీరో హోండా షోరూమ్, హ్యుందాయ్ షోరూమ్‌కు మధ్యలో పద్మావతీ పురానికి వెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ రోడ్డును ఇటీవలే అందుబాటులో తెచ్చారు. ఈ పరిసర ప్రాంతాలు గత 20 ఏళ్లుగా కమర్షియల్ ఏరియాగా నగర ప్రజలకు సుపరిచితమే. ఈ రోడ్డు నిర్మాణానికి కంచి రాము అనే వ్యక్తి తన 3,113 చదరపు గజాల స్థలాన్ని కార్పొరేషన్‌కు గిఫ్ట్ డీడ్‌గా రాసిచ్చారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల మేరకు సబ్‌రిజిస్ట్రార్ విలువ ప్రకారం నాలుగు రెట్లు కేటాయిస్తూ టీడీఆర్ బాండ్ అందజేశారు. అయితే సదరు స్థలం అగ్రికల్చర్ ల్యాండ్ అంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. వ్యవసాయ భూమిని కమర్షియల్‌గా చూపించారని పాలకులకు దురుద్దేశాలను ఆపాందించారు. ఇలా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్న అంశాలు.. పచ్చ పత్రికలు ప్రచురిస్తున్న కథనాలు సత్యానికి దూరంగా, అభివృద్ధిని అడ్డుకునేలా ఉన్నట్లు నగర ప్రజలు మండిపడుతున్నారు.
– 8లో
– 8లో