
సాక్షి, సికింద్రాబాద్: రేతిఫైల్ బస్టాప్ వద్ద ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయిన దుర్గాప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. రెండు బస్సుల మధ్య ప్రమాదశాత్తూ ఇరుక్కుపోయిన దుర్గాప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, అతనికి సాయం చేసేందుకు ప్రయాణికులెవరూ దగ్గరకు కూడా వెళ్లలేదు. తీవ్ర గాయాలతో కాపాడండీ అంటూ ఆ యువకుడు అరగంట పాటు ఆర్తనాదాలు చేసిన ఎవరూ కాపాడే ప్రయత్నం చేయలేదు. చివరికి ఆర్టీసీ సిబ్బంది ‘108’కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేలోపు ఆ యవకుడు ప్రాణాలు విడిచాడు.
చదవండి: మాజీ ఎంపీ ఇంట్లో విషాదం..
మావోయిస్టుల ఇళ్లకు రాచకొండ పోలీసులు