మా ఊరికి ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు రావొద్దు | Villagers Blocking Private School Buses | Sakshi
Sakshi News home page

మా ఊరికి ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు రావొద్దు

Jun 21 2025 1:48 PM | Updated on Jun 21 2025 2:59 PM

Villagers Blocking Private School Buses

పెద్దపల్లి జిల్లా ఊశన్నపల్లిలో అడ్డుకున్న గ్రామస్తులు

 ప్రభుత్వ బడికే పిల్లలను పంపాలని తల్లిదండ్రులకు వినతి 

కాల్వశ్రీరాంపూర్‌ (పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వ­శ్రీరాంపూర్‌ మండలం ఊశన్నపల్లిలో శుక్రవారం ప్రై­వేటు స్కూళ్ల బస్సులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ ఊరికి ప్రైవేటు స్కూల్‌ బస్సులు రావద్దని, గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని తల్లిదండ్రులను కోరారు. ఉదయం స్కూల్‌ బస్సులు వచ్చే సమయానికి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద గుమికూడిన కొంద­రు గ్రామస్తులు.. బస్సులు ఎక్కుతున్న పిల్లలను దించివేశారు. దీంతో గ్రామస్తులంతా అక్కడికి చేరు­కున్నారు.

పాఠశాల హెచ్‌ఎం ఈర్ల సమ్మయ్య ఈ వి­ష­యాన్ని ఎంఈఓ మహేశ్‌కు తెలపటంతో హుటా­హుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రైవేటు స్కూళ్ల­కు వెళ్తున్న పిల్లల తల్లిదండ్రులతో ఆయన మాట్లాడా­రు. పిల్లలను ప్రభుత్వ బడికి పంపించాలని కోరారు. అనుమతులు లేకుండా పిల్లలను తరలిస్తున్న వ్యాన్ల డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊశన్నపల్లి పాఠ­శా­ల ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ, విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని, కలెక్టర్‌ చేతుల మీదుగా ‘బెస్ట్‌ స్కూల్‌’‘ఛాంపియన్‌ స్కూల్‌’అవార్డులు పొందారని ఎంఈఓ గుర్తు చేశా­రు. తల్లిదండ్రులు నిజం తెలుసుకొని తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపాలని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement