వందేభారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి

Vande Bharat Train Attacked With Stones At Mahabubabad - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: సికింద్రాబాద్‌- విశాఖపట్నం వందే భారత్‌ ఎక్స్‌ప్రైస్‌  రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. మహబూబాబాద్‌-గార్ల రైల్వే స్టేషన్ల మధ్య దుండగులు రాళ్లు విసరడంతో రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. రైలు సికింద్రాబాద్‌ నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.  రైలులోని కోచ్‌-4 , కోచ్‌-8లో అద్దాలు పగిలాయని, ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. 

గతంలో వందే భారత్‌ రైలు ప్రారంభానికి ముందు ఆకతాయిలు రాళ్లు విసిరిన ఘటన విశాఖలో జరిగింది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా విశాఖ స్టేషన్‌ నుంచి కోచ్‌ కాంప్లెక్స్‌కు ట్రైన్‌ వెళ్తుండగా..  కంచరపాలెం రామ్మూర్తిపంతులు పేట వద్దకు రాగానే  కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో వందే భారత్‌ రైలు కిటికీ అద్దం ధ్వంసమైంది. 

కాగా ఇంతకుముందు  ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. వందే భారత్ రైలుపై ప్రారంభానికి ముందే రాళ్ల దాడి జరిగింది.  ట్రయిల్ రన్‌లో భాగంగా విశాఖ స్టేషన్‌కు వచ్చిన వందే భారత్ రైలుబోగీలపై కంచరపలెంలో రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో వందే భారత్‌ రైలు కిటికీ అద్దం ధ్వంసమైంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top