రంగారెడ్డి: డాక్టర్‌ వైశాలి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్‌

Twist In Doctor Vaishali Kidnap Case Adibatla Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్ల డాక్టర్‌ వైశాలి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్‌ నెలకొంది. అపహరణకు గురైన యువతి వైశాలి తన తండ్రి దామోదర్‌కు ఫోన్‌ చేసింది. తను సిటీలోనే సేఫ్‌గానే ఉన్నానని తండ్రికి చెప్పింది. తన గురించి ఆందోన చెందవద్దంటూ పేర్కొంది.

మరోవైపు యువతి కిడ్నాప్‌ ఘటనతో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో ఉద్రిక్తత నెలకొంది. యువతి కిడ్నాప్‌కు గురైందన్న విషయం తెలుసుకున్న బంధువులు ఆమె బంధువులు భారీగా తరలివచ్చారు. తీవ్ర ఆగ్రహంతో కిడ్నాప్‌ చేసిన నవీన్‌రెడ్డి టీస్టాల్‌ను తగలబెట్టారు. తమ కూతురు కిడ్నాప్‌కు సీఐ నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీఐని సస్పెండ్‌ చేయాలంటూ యువతి బంధువులు ఆరోపిస్తున్నారు.

నవీన్‌ రెడ్డి గ్యాంగ్‌ ఇంటిపై దాడి చేస్తున్న సమయంలో పోలీసులకు కాల్‌ చేసినా స్పందించలేదని ఆరోపించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ సాగర్‌ రాహదారిపై యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. దీంతో  సాగర్‌ రోడ్డుపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 

గతంలో నవీన్‌రెడ్డిపై ఆదిభట్ల పీఎస్‌లో ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో డెంటల్‌ డాక్టర్‌ వైశాలి కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. డీసీఎం, కార్లలో వచ్చిన 100 మందికి పైగా యువకులు.. ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top