
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్న TUWJ ఢిల్లీ విభాగానికి నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఢిల్లీ TUWJ అధ్యక్షుడిగా నాగిళ్ల వెంకటేష్(సాక్షి టీవీ ),ప్రధాన కార్యదర్శిగా మేకా గోపికృష్ణ (టివి9),ఉపాధ్యక్షులుగా వంగా తిరుపతి(వెలుగు),పబ్బా సురేష్, కోశాధికారిగా రాజు కొన్నోజు(ఎన్టీవీ) కార్యదర్శులుగా రాజ్ కుమార్ గుజరాతి(సాక్షి), కామరాజు,లింగా రెడ్డి (టి న్యూస్), నాగరాజు(వి6) , కార్యవర్గ సభ్యులుగా పిల్లి రాజేందర్ (ఆంధ్ర ప్రభ ) సలహా దారులుగా సతీష్ ముక్కాముల(ఏ బి ఎన్ టీవీ ), డి. విజయ్ కుమార్, రాష్ట్ర కమిటి సభ్యులుగా రాజశేఖర్ రెడ్డి (సాక్షి ),శిరీష్ రెడ్డి(మహా న్యూస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ , IJU కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్ ,కోశాధికారి యోగానంద,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తిరుపతి నాయక్ సమక్షంలో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది.
ఈ సందర్భంగా TUWJ యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఢిల్లీ TUWJ అమలుచేస్తున్న పది లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో అర్హతగల జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రకటించిన 10 కోట్లను విడుదల చేస్తామని సీఎంఇచ్చినహామీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.