వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు  | TTD Second Annual Brahmotsavam In Jubileehills | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు 

Mar 4 2022 6:29 AM | Updated on Mar 4 2022 9:43 AM

TTD Second Annual Brahmotsavam In Jubileehills - Sakshi

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న రెండో వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపిస్తున్నాయి. అంగరంగ వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలను తిలకించి శ్రీవారి వాహన సేవల్లో పాల్గొనేందుకు నగర నలు మూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఈ నెల 1న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మూడో రోజైన గురువారం స్వామి వారిని ఉదయం సింహవాహనంలో ఊరేగించగా భక్త జనసందోహంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం సుప్రభాతం, తోమాల అర్చన అనంతరం భక్తులకు సర్వదర్శనానికి అనుమతించారు.    

Advertisement
 
Advertisement
Advertisement