నవంబర్‌ 7న ఎఫ్‌ఎస్‌వో అర్హత పరీక్ష

TSPSC FSO Recruitment 2022 Exam Date 7th November - Sakshi

వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లు  

సాక్షి, హైదరాబాద్‌: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం)లో ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నవంబర్‌ 7న అర్హత పరీక్ష నిర్వహి­స్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసు­కున్న అభ్యర్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందు­బాటులో ఉంచినట్లు తెలిపింది.

అభ్యర్థులు వెంటనే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, అర్హత పరీక్షను సీబీఆర్టీ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. హాల్‌టికెట్లలో నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధం కావాలని సూచించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top