ఆచారిపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్‌

TRS Leaders Complaint To SEC Over National BC Commission Member - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడింది అంటూ టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్ సెక్రెటరీ భరత్ కుమార్ మాట్లాడుతూ.. ఈరోజు ఎన్నికల సంఘానికి రెండు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. బీజేపీ నాయకత్వం చట్టాన్ని ఉల్లంఘించింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి మీటింగ్‌లు, సభలు పెట్టరాదు అంటూ హై కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికి..  తేజస్వీ సూర్య అక్కడ మీటింగ్ పెట్టారు. ఇది చట్ట విరుద్ధం. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల్‌ కమిషన్‌ని కోరడం జరిగింది’ అన్నారు. ( సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్:రాములమ్మ)

బీజేపీ వాళ్లు మేము ఇలానే రెచ్చగొడుతాం అంటున్నారు. శాంతియుతంగా ఉన్న హైదరాబాద్‌లో అల్లర్లు చేద్దాం అని చూస్తున్నారు. నేషనల్ బీసీ కమిషన్ మెంబర్ ఆచారి బీజేపీ తరఫున ప్రచారం చేస్తూ.. అధికార దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపై కూడా పిర్యాదు చేశాం. రాష్ట్రపతికి కూడా పిర్యాదు చేస్తాం. మా దగ్గర అతను ప్రచారం చేసినదానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి. బీసీ కమిషన్ మెంబెర్‌ ప్రచారంలో పాల్గొనకుండ చూడాలి’ అని ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేశామన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top