విద్యార్థుల రక్షణ సామాజిక బాధ్యత 

Trisabhya Committee Opinion On School Students Safety - Sakshi

అభిప్రాయ సేకరణలో త్రిసభ్య కమిటీ   

సాక్షి, హైదరాబాద్‌: స్కూల్‌ విద్యార్థుల భద్రత, రక్షణను సామాజిక బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరముందని పాఠశాల విద్యార్థుల భద్రత, రక్షణ కోసం ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ముందు పలువురు అభిప్రాయపడ్డారు. స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ రాణీకుముదిని అధ్యక్షురాలిగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సోమవారం హైదరాబాద్‌ ఎంహెచ్‌ఆర్డీలో వివిధ వర్గాలతో భేటీ అయి, వారి సలహాలు, సూచనలు తీసుకుంది.

ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ స్వాతి లక్రా, ప్రభుత్వ కార్యదర్శి దివ్య దేవరాజన్, డీపీజీ మహేందర్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన పాల్గొన్నారు. పిల్లలపై జరిగే ఘటనలను మార్గదర్శకాల రూపకల్పనపై కమిటీ సలహాలు తీసుకుంది. డీజీపీ మాట్లాడుతూ భద్రత, రక్షణవిషయంలో యాజమాన్యాలను భాగస్వాముల ను చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వ్యవస్థీకృత చట్టంలో మార్గదర్శకాల రూపకల్పన చేయాలన్నారు.  ఘటన జరగకముందే మేల్కొనే వ్యవస్థ ఏర్పాటు అవసర మని స్వాతి లక్రా  సూచించారు. పిల్లలరక్షణ సామాజిక బాధ్యతగా అందరూ భావించాలని దేవసేన అన్నారు. సమావేశంలో వివిధ జిల్లాల విద్యాశాఖాధికారులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top