ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్‌ జ్యోతికి 14 రోజుల రిమాండ్

Tribal Welfare Executive Engineer Jyothi Judicial Remand - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ విభాగం ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(ఎస్‌ఈ) కె.జగజ్యోతిని ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. జ్యోతికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మార్చ్‌ 6 వరకు జ్యోతికి రిమాండ్ విధిస్తున్నట్లు ఏసీబీ కోర్టు పేర్కొంది. జ్యోతిని చంచల్‌గూడా మహిళా జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.

మరోవైపు రిమాండ్ ఆపాలని జ్యోతి తరపు న్యాయవాది ఏసీబీ కోర్టును కోరారు. జ్యోతిని అరెస్ట్ చేసి 24 గంటలు గడిచిపోయిందని జజ్యోతి తరపు నన్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు అనుమతి తీసుకున్నారని ఏసీబీ న్యాయమూర్తి తెలిపారు. దీంతో జ్యోతికి 14 రోజుల రిమాండ్ విధింస్తున్నామని కోర్టు తెలిపింది.

వివరాల్లోకి వెళితే... గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిజామాబాద్‌ పట్టణంలో ఒక నిర్మాణ పనిని, గాజుల రామారంలో జువెనైల్‌ బాయిస్‌ హాస్టల్‌ నిర్మాణపనులను బొడుకం గంగన్న అనే లైసెన్స్‌డ్‌ కాంట్రాక్టర్‌ చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయమై కాంట్రాక్టర్‌ను ఆ శాఖ ఇంజనీరింగ్‌ విభాగం ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ కె.జగజ్యోతి లంచం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కాంట్రాక్టర్‌ నుంచి రూ.84 వేల లంచం తీసుకుంటుండగా సోమవారం హైదరాబాద్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ(డీఎస్‌ఎస్‌) భవన్‌లో జగజ్యోతిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈఈ స్థాయి అధికారి అయిన జగజ్యోతి ఇన్‌ఛార్జి హోదాలో ఎస్‌ఈ బాధ్యతలూ నిర్వర్తిస్తుండటం గమనార్హం.  

చదవండి: ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్‌ జ్యోతి అరెస్ట్

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top