దాడి చేసుకున్న హిజ్రాలు | Transgenders Fight on Road | Sakshi
Sakshi News home page

దాడి చేసుకున్న హిజ్రాలు

Jun 28 2025 11:30 AM | Updated on Jun 28 2025 12:08 PM

Transgenders Fight on Road

భయభ్రాంతులకు గురైన స్థానికులు
 

జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని పాతబస్టాండ్‌లో గురువారం రాత్రి హిజ్రాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. జగిత్యాల జిల్లాకు చెందిన హిజ్రాలు పాతబస్టాండ్‌ ప్రాంతంలో తిరుగుతుండగా సిద్ధిపేట జిల్లాకు చెందిన మరికొంత మంది హిజ్రాలు పాతబస్టాండ్‌కు చేరుకున్నారు. 

దీంతో తమ అనుమతి లేకుండా తమ జిల్లాకు ఎందుకు వచ్చారంటూ రెండు వర్గాల వారు వాగ్వాదానికి దిగారు. ఇంతలో రెచ్చిపోయిన హిజ్రాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హిజ్రాలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement