Telangana: New Committee Of Are Kula Sangam Was Elected - Sakshi
Sakshi News home page

ఆరె కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా చెట్టిపల్లి శివాజీ

Feb 21 2023 2:39 AM | Updated on Mar 9 2023 4:21 PM

Telangana: New Committee Of Are Kula Sangam Was Elected - Sakshi

ఆరె కుల సంఘం నూతన కమిటీ అధ్యక్షుడు చెట్టిపల్లి శివాజీ తదితరులు 

అంబర్‌పేట (హైదరాబాద్‌): ఆరె కుల సంఘం రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికైంది. సోమవారం అంబర్‌పేటలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో కమిటీ ఆవిర్భవించింది. అధ్యక్షుడిగా చెట్టిపల్లి శివాజీ, గౌరవ అధ్యక్షుడిగా నాగూర్ల వెంకన్న, స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌గా దిగంబర్‌రావు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా రాంబాబు, ఉద్యమ కమిటీ చైర్మన్‌గా అంజన్‌రావు, ఆరె కుల రైతు సంఘ అధ్యక్షుడిగా మోర్తాల చందర్‌రావుతో పాటు వివిధ కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా కమిటీ పలు తీర్మానాలను ఆమోదించింది. ఉప్పల్‌ బగాయత్‌లో ఆరె కుల సంఘానికి ఒక ఎకరం స్థలం, రూ.కోటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు. అలాగే భవన నిర్మాణానికి మరో రూ.4 కోట్ల నిధుల కోసం విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఆరె కుల సంఘాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానించారు. సమావేశంలో కుల సంఘం నాయకులు రామ నర్సింహయ్య, కోల కృçష్ణస్వామి, నర్సింగ్‌రావు, శ్రీనివాస్, దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement