Telangana Minister: Srinivas Goud Mother Santhamma Passed Away - Sakshi
Sakshi News home page

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మాతృ వియోగం

Oct 30 2021 11:51 AM | Updated on Oct 31 2021 3:25 AM

Telangana Minister Srinivas Goud Mother Santhamma Passed Away - Sakshi

తల్లి శాంతమ్మకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌   

పాలమూరు: ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాతృ మూర్తి  శాంతమ్మ (70) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం ఆమె పార్థివదేహాన్ని మహబూబ్‌నగర్‌లోని మంత్రి నివాసానికి తరలించారు. సాయంత్రం పాలకొండ సమీపంలోని మంత్రి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు.

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర ప్రజాప్రతి నిధులు శాంతమ్మకు నివాళి అర్పించి.. శ్రీనివాస్‌గౌడ్‌ను పరా మర్శించారు. కాగా, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి నారాయణగౌడ్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 14న మరణించారు. శాంతమ్మ మృతితో మంత్రి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. 

శ్రీనివాస్‌గౌడ్‌ మాతృమూర్తికి గవర్నర్, సీఎం సంతాపం
సాక్షి, హైదరాబాద్‌: ఆబ్కారీ శాఖమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ మాతృమూర్తి శాంతమ్మ మరణం పట్ల గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement