
ఫైల్ ఫొటో
ప్రతిపాదనల్లో సందేహాలు తలెత్తడంతో వాటి నివృత్తికి కమిషన్ సవరణ ప్రతిపాదనలు కోరినట్లు తెలిసింది. ఆయా శాఖలు సవరణ ప్రతిపాదనలు సమర్పించిన వెంటనే టీఎస్‌పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 ఉద్యోగ నియామకాల కసరత్తు వేగవంతమైంది. ఆర్థిక శాఖ అనుమతిచ్చిన 503 గ్రూప్–1 ఉద్యోగాలకు వచ్చే వారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నిర్దేశించిన పోస్టులకు సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖలు టీఎస్‌పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పిం చగా ఒకట్రెండు శాఖలకు సంబంధించిన ప్రతిపాదనల్లో సందేహాలు తలెత్తడంతో వాటి నివృత్తికి కమిషన్ సవరణ ప్రతిపాదనలు కోరినట్లు తెలిసింది.
ఆయా శాఖలు సవరణ ప్రతిపాదనలు సమర్పించిన వెంటనే టీఎస్‌పీఎస్సీ సమావేశమై కోరం ఆమోదంతో ఉద్యోగ ప్రకటన జారీ చేయనుందని, ఈ ప్రక్రియకు ఎంతో సమయం పట్టదని టీఎస్‌పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం సైతం టీఎస్‌పీఎస్సీ యంత్రాంగం గ్రూప్–1 ఉద్యోగ ప్రకటనపై పలు సమీక్షలు నిర్వహించి ప్రక్రియ పూర్తికి కసరత్తు చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు రాష్ట్రంలో గ్రూప్–1 ఉద్యోగ నియామకాలు జరగలేదు. దీంతో కమిషన్ నుంచి ప్రకటన వస్తే రాష్ట్రంలో అదే తొలి ప్రకటన కానుంది.
(చదవండి: ఇంటర్వ్యూ రద్దుతో ‘రాత’ మారేనా!)