TG: వరద బాధితులకు ప్రభుత్వ సాయం.. డబ్బు, ఇల్లు ఇంకా.. | Telangana Government Compensation Announce For Flood Victims | Sakshi
Sakshi News home page

TG: వరద బాధితులకు ప్రభుత్వ సాయం.. డబ్బు, ఇల్లు ఇంకా..

Published Mon, Sep 9 2024 6:45 PM | Last Updated on Mon, Sep 9 2024 6:50 PM

Telangana Government Compensation Announce For Flood Victims

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ముంపు ప్రాంతాల వరద బాధితులకు నష్టపరిహారంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్టు తాజాగా ప్రకటించింది. అలాగే, తడిచిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని రైతులకు రేవంత్‌ సర్కార్‌ హామీ ఇచ్చింది.

కాగా.. భారీ వర్షాలు, వరదలపై సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ‘చివరి బాధితుడి వరకు సహాయం అందిస్తాం. భారీ వర్షాలతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది. కూలిపోయిన, దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇ​స్తాం. ప్రతీ కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సహాయం అందజేస్తాం. మృతుల కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు  రూ.5 లక్షల సహాయం చేస్తాం.  

వరద ముప్పునకు గురైన ప్రతీ ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సహాయం ఇస్తాం. వరదల కారణంగా తడిచిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం. యుద్ధ ప్రతిపాదికన తాత్కాలికంగా రహదారుల మరమత్తులు చేపడతాం. డాక్యుమెంట్స్ కొట్టుకుపోయాయని ఆందోళన చెందకండి. ప్రతీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement