తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 30,453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి

Telangana Finance Ministry Approves First Phase Of Jobs Recruitment 2022 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 ఉద్యోగ  ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.

దీనిపై ఆర్థిక శాఖ  మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనమతులు ఇవ్వాలని సీఎం శాసనసభలోనే చెప్పడం జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర మంత్రులతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల  అధికారులతో పలు ధపాలుగా చర్చించారు. 

80,039 ఉద్యోగాలకుగాను, తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఇవాళ(బుధవారం) ఆర్థిక శాఖ పచ్చా జెండా ఊపింది. ఈ మేరకు అనుమతులిస్తూ జీవోలు జారీ చేసింది. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు,  ఆయా శాఖల మంత్రులు,  ఆయా శాఖ  అధికారులు, ఆర్థిక శాఖ  అధికాలుతో చర్చించి మిగతా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడం జరుగుతుంది.

రాష్ట్ర​వ్యాప్త నిరసనలకు సీఎం కేసీఆర్‌ పిలుపు
రేపు(గురువారం) రాష్ట వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు సీఎం కేసీఆర్‌ పిలునిచ్చారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రదర్శనలు చేపట్టాలని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top