ఎమ్మెల్యేలకు 'ఎర' వ్యవహారం.. కేసీఆర్ విడుదల చేసిన 70 నిమిషాల వీడియో సంభాషణ ఇదే..

Telangana CM KCR Releases Video Conversation BJP Poaching - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేయడానికి సంబంధించి మొయినాబాద్‌ మండలంలోని అజీజ్‌నగర్‌ ఫామ్‌హౌస్‌లో బీజేపీ దూతలుగా చెబుతున్న వారి మధ్య జరిగిన వీడియో సంభాషణల రికార్డింగ్‌ను (మొత్తం నాలుగు క్లిప్‌లు) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం బహిర్గతం చేశారు. మూడు గంటలు ఉన్న వీడియో సంభాషణలను 70 నిమిషాలకు కుదించి విడుదల చేస్తున్నట్లు సీఎం తెలిపారు.

బీజేపీలో ముగ్గురు వ్యక్తులే అన్ని నిర్ణయాలు తీసుకుంటారని, ప్రధాని నేరుగా ఉండరని, అయితే అన్ని విషయాలూ ఆయనకు వివరిస్తారంటూ జరిగిన సంభాషణలు ఇందులో ఉన్నాయి. ఎమ్మెల్యేలు పైలట్‌ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగ కాంతారావుతో రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌ జరిపిన సంభాషణల్లోని కీలక అంశాలు ఇలా ఉన్నాయి.  

రోహిత్‌రెడ్డి: మీతో (రామచంద్ర భారతి) చెప్పినట్లు మేమంతా సిద్ధం. మీరు వీరితో కూడా ఓపెన్‌గా చర్చిస్తే వారికి నమ్మకం ఏర్పడుతుంది.  
రామచంద్ర: మీతో ఇదివరకే చర్చించాం.. 
రోహిత్‌: మీరు నాతో చర్చించడం వేరు. వారితో చర్చించడం వేరు.  
రామచంద్ర: ఇక్కడ డెలివరీ(డబ్బు)కి కమిట్‌ చేయించారు. తరువాత ఢిల్లీకి వెళ్దాం. నేను ఢిల్లీకి మెసెజ్‌ పంపించాను. అక్కడనుంచి సమాధానం కోసం చూస్తున్నా. 
రోహిత్‌: ఫిగర్‌ కూడా ఎంతో చెప్పండి.  
రామచంద్ర: ఒక్కొక్కరికి 50. 
గువ్వల బాలరాజు: అంటే.. 
రోహిత్‌: ఒక్కొక్కరికి రూ.50 కోట్లు (అందరు నవ్వులు). ఆయన ఢిల్లీకి సమాచారం పంపించారు.  
సింహయాజి: మీరు రూ.50 లక్షలు అనుకుంటున్నారా.? కాదు. రూ.50 కోట్లు 
బాలరాజు: మరో ఐదుగురు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం.. 
రోహిత్‌రెడ్డి: ఆ విషయం వారితో చర్చించా. 
సింహయాజి, నందు: ఇది తర్వాత చూద్దాం. మీకు ఎక్కడ డెలివరీ కావాలో అక్కడ ఇచ్చేస్తాం.  
నందు: మరో ఐదుగురు కూడా సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా తీసుకుంటామా..! 
రామచంద్ర: ఎస్‌.. వాళ్లను కూడా..వీ వాంట్‌ ఎగ్జాట్‌ నంబర్స్‌. 
నందు: ఎస్‌. వాళ్లు వస్తారు.  
రోహిత్‌: మూడు అడిగా. 
బాలరాజు: నీవు ఏం అడిగావో మాకేమి తెలుసు. 
రోహిత్‌:  బీ ఫామ్‌లు వారే ఇవ్వాలి.  
రామచంద్ర: బీ ఫామ్‌ కంటే ముందు.. మీరు క్లియర్‌గా ఉండాలి. మేము క్లియర్‌గా ఉంటాం. పార్టీలో చేరిన తరువాత బీ.ఫామ్‌ మా హామీ. చూడండి బీజేపీలో ముగ్గురు వ్యక్తులు ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. రాష్ట్ర నాయకత్వానికి ఏ సంబంధం ఉండదు. బీజేపీలో మొత్తం చూస్తారు. బీఎల్‌ సంతోష్, అమిత్‌షా, జేపీ నడ్డా. 
బాలరాజు: ప్రధానమంత్రి 
రామచంద్ర: పీఎం ఎందులోనూ నేరుగా ఇన్వాల్వ్‌ కారు. ఆయనకు వీరి నుంచి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అందుతుంటుంది అంతే.  
బాలరాజు:  ఆరెస్సెస్‌ వేరు, బీజేపీ వేరు అనే చర్చ నడుస్తోంది... 
రామచంద్ర: అవును వేర్వేరు. ఆరెస్సెస్‌ ఓ సామాజిక సంస్థ. భాజపా ఒక రాజకీయ సంస్థ. అయితే ప్రతి భాజపా వ్యక్తికీ ఆరెస్సెస్‌ నేపథ్యం  ఉంది.  
బాలరాజు: ఈయన కూడా అంతేనా? రామచంద్రభారతిని చూపిస్తూ... 
సింహయాజి: అవును...అంటూ ఆయన ఎదిగిన తీరును వివరించారు.  
(మరోసారి సంతోష్, అమిత్‌ షా, నడ్డాలు ఎలా హ్యాండిల్‌ చేస్తారో వివరించారు.)  
రామచంద్ర: మేం ఇక్కడికి వచ్చే ముందే విషయాలన్నీ చెప్పాం. అన్నింటికీ వారు ఒప్పుకున్నారు. ఎటువంటి కమ్యూనికేషన్‌ గ్యాప్‌ లేదు. బీఎల్‌ సంతోష్‌ కాంగ్రెస్‌లోని సూర్జిత్‌వాలా లాగే ఆర్గనైజింగ్‌ సెక్రటరీ. ఆయనకు ఎవరికి బీఫామ్‌ ఇవ్వాలి వంటి విషయాల్లో పూర్తి అధికారం ఉంది.  
ఎమ్మెల్యేలు: మేం బీఫామ్‌ కోసమో దేనికో ఇక వేరే ఎవరినీ అప్రోచ్‌ కావాల్సిన అవసరం లేదు.
రామచంద్ర:  లేదు లేదు ఆ అవసరమే లేదు. మేం ఇక్కడ నుంచి వెళ్లేలోపుగానే మీకు వచ్చే ఎన్నికల్లో బీఫామ్‌ కన్ఫర్మేషన్‌ వస్తుంది. అలాగే మరో 2 విషయాల్లో సంపూర్ణంగా స్పష్టత  వస్తుంది. ఇదంతా క్రిస్టల్‌ క్లియర్‌ ఆపరేషన్‌.  
ఎమ్మెల్యేలు: మేం ఎవరైనా రాష్ట్ర నేతలతో టచ్‌లో ఉండాలి అంటారా? 
రామచంద్ర: లేదు లేదు... అక్కర్లేదు కేవలం మీరు రోహిత్‌తో టచ్‌లో ఉంటే చాలు.  
రోహిత్‌: మనం అంతా డైరెక్ట్‌ ఢిల్లీతోనే సార్‌. నిజానికి వీళ్లు స్వామిజీకి ఇన్‌చార్జిలు. స్వామిజీ నే కర్ణాటక, మహారాష్ట్ర చేశారు.. అంటుండగా..  
రామచంద్ర:  కర్ణాటక ఆపరేషన్‌ చేశాం మీకు తెలుసుగా? కాంగ్రెస్‌ నుంచి 16 మందిని తీసుకుని మేం ప్రభుత్వం ఏర్పాటు చేశాం,  అయితే కర్ణాటకకు, తెలంగాణకు వ్యత్యాసం ఉంది. తెలంగాణ, ఆంధ్ర పూర్తిగా వేరే.. మిగతా వాటితో పోలిస్తే..మీ ఒక నియోజకవర్గ ఎన్నికతో మేం రాష్ట్ర స్థాయి ఎన్నికలే నిర్వహించగలం. (నవ్వుతూ) మీరిక్కడ ఒక ఎన్నిక కోసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తే మేం ఆ మొత్తంతో 70, 80 నియోజకవర్గాలు ఫినిష్‌ చేస్తాం.  
రామచంద్ర:  బీఆర్‌ఎస్‌ పేరుతో ఇప్పటికే 4 రాజకీయ పార్టీలు నమోదై ఉన్నాయి.  
ఎమ్మెల్యేలు: అయితే మీరు ఆపుతారా? 
సింహయాజి: అదంతా ఒక పొలిటికల్‌ సిస్టమ్‌ ప్రకారం నడుస్తుంది. 
ఎమ్మెల్యేలు: తెలంగాణ బాగా కాస్ట్‌లీ చేసేశారు... మునుగోడు కూడా కాస్ట్‌లీ చేసేస్తున్నారు. ఇంకేముంది ఆయనకు రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ ఇ­చ్చా­రు. కాంట్రాక్ట్‌ సరే ఎంత ఖర్చుపెడుతున్నారు? 
సింహయాజి: ఎంతైనా పెట్టుకుంటాడు అది ఆయనే...కాదు కాదు పార్టీ కూడా ఇచ్చింది. 30 ఇచ్చింది ఆల్రెడీ... ఇంకో 20 వస్తుంది. 
రామచంద్ర: మరో 15 ఏళ్లు భాజాపా పాలనే ఉంటుంది. ఇది ఫిక్స్‌. కాంగ్రెస్‌కి లీడర్‌ లేడు. బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీ కానీ నిర్మాణం లేదు. తెలంగాణ అవతల వారికి జాతీయ స్థాయి నేత ఎవరూ లేడు. మమతా బెనర్జీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ సహా మొత్తం 17 పార్టీలు కలిసి ఒక ప్రతిపక్ష పార్టీగా మారడం అసాధ్యం. ఎందుకంటే అందులో ప్రతి ఒక్కనేతా ప్రధాని అభ్యర్ధే. నితిష్, ఖర్గే, గెహ్లాట్, కేసీఆర్, కేజ్రీవాల్‌...అందరూ పీఎం అభ్యర్థులే...అందుకే వాళ్లు కలవరు. అందుకే 15 ఏళ్లు భాజాపాదే పాలన.  
ఎమ్మెల్యేలు: ఈవీఎం మిషన్లు ఉన్నాయి  
రామచంద్ర: మేం ఆ మిషన్లతో ఆపరేట్‌ చేయం కానీ (నవ్వుతూ) అందుకేనేమో బ్యాలెట్‌ రావాలంటు­న్నారు. బ్యాలెట్‌తో కూడా ఇష్యూ ఉంది. ఈవీఎంతో కూడా ఉంది. ఈవీఎంలో కొంత స్ట్రాటజీ ఉంది.  
ఎమ్మెల్యేలు: స్వామిజీ మీరు ఎప్పుడైనా రాజకీయాల్లో ఉన్నారా?  
రామచంద్ర: నేను ఆరెస్సెస్‌ వ్యక్తిని పూర్తిగా  
సింహయాజి: రామచంద్ర భారతి స్వామిజీ చాలా పవర్‌ ఫుల్, పెద్ద పెద్ద నేతలతో తిరుగుతారు. ఆయన మోదీగారు ఒకే ఫ్లైట్‌లో వెళ్లి వస్తుంటారు.  
ఎమ్మెల్యేలు: స్వామిజీ వయసు? 
సింహయాజి: రుషిమూలం, నదిమూలం అడగకూడదు అంటారు.

ఇక్కడైన తర్వాత  ఆంధ్రా
ఎమ్మెల్యేలు: మరి బండి సంజయ్‌..! 
నందకుమార్‌: ఇక్కడ ఎవరిదీ నడవదు బండి సంజయ్, కిషన్‌రెడ్డి కాదు.. అంతా సంతోష్‌దే పవర్‌ 
సింహయాజి: బీఎల్‌ సంతోష్‌ క్యాండిడేట్లే ఉన్నారందరూ అర్థమైందా? 
ఎమ్మెల్యేలు: మరి అమిత్‌షా.. 
సింహయాజి: అమిత్‌షా, సంతోష్‌ అందరూ ఒకటే­గా.. అంతేకాదు బీఎల్‌ సంతోష్‌ నో అంటే అమిత్‌షా ఏమీ చేయలేరు. అంత పవర్‌ఫుల్‌ సంతోష్‌. రాష్ట్రపతి కూడా ఈయన చెప్పింది వినాలి. ప్రతి కేబినెట్‌ మీటింగ్‌లో కూడా బీఎల్‌ సంతోష్‌ కూర్చుంటారు. 
నందుకుమార్‌: అన్నా అశోకా నైన్‌లో ఉంటాడు. మోడీ, అమిత్‌షా మాట్లాడాలనుకుంటే ఫోన్‌ నంబర్‌ ఇచ్చి పోతాడు. ఈయన మాత్రం పోడు. 
సింహయాజి: ఆయన పోడు.. క్వశ్చనే లేదు. ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌ అంత పవర్‌ ఇచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌ తరఫున ఆయన.. 
ఎమ్మెల్యేలు: స్వామీజీ అంతా ఇప్పుడు మనకు.. 
సింహయాజి: బీజేపీనంతా స్వామీజీలే ఆపరేట్‌ చేసేది. వీళ్లందరూ పోయి ఎందుకు స్వాముల్ని మొక్కుతుంటారు. చినజీయర్‌ స్వామికి.. ఆ స్వామికి..! 
నందు: ఈయన ఎంత సింపుల్‌గా ఉంటారంటే.. ఏమీ ఎక్స్‌పెక్ట్‌ చేయరు. అంతా మన సనాతన ధర్మం గురించే.. మోదీ, నడ్డా, అమిత్‌షా మాదిరి మొత్తం ఆరుగురే డీల్‌ చేసేది. ఈ ఆరుగురే అంతా.. 
రామచంద్ర: వీరంతా ఒప్పుకున్నా.. సంతోష్‌ నో అంటే నో అనే.. 
ఎమ్మెల్యేలు: పీఎం ఒప్పుకున్నా కూడానా? 
సింహయాజి: అవును పీఎం ఒప్పుకున్నా కూడా.. 
ఎమ్మెల్యేలు: అక్కడ ఎలా ఉంది స్వామి? ఆంధ్రా.. ఇదే ఆపరేషనా? 
సింహయాజి: ఇది అయిపోతే మొదలుపెడతాం 
రోహిత్‌రెడ్డి: క్యాష్‌ ఏడుందో చెప్తారు. చెప్తే మనం పోయి పిక్‌ చేసుకుని.. (ఇంతలో స్వామీజీ కల్పించుకుని ఆపారు) 
ఎమ్మెల్యేలు: మొత్తానికి ఢిల్లీ ఫెయిలైనట్టేనా? (ప్రభుత్వం కూల్చివేతపై) 
నందు: కాదు.. ఢిల్లీ కూడా స్టార్టయింది. 
సింహయాజి: 35 మంది రెడీ.. అసలు వాడ్ని ఎత్తేశాంగా ఇప్పుడు ఒకడిని. ఈడీని పెట్టి.. 
నందకుమార్‌: సిసోడియా గాడ్ని ఈడీ పెట్టి ఇరికించారు. 
సింహయాజి: సిసోడియాతోనే ఎమ్మెల్యేలు వస్తున్నారు ఇప్పుడు తెలుసా? 
ఎమ్మెల్యేలు: అవునా?  
సింహయాజి: అవును అందుకే ఈడీ. 
నందకుమార్‌: 36 మంది రెడీ. రాజస్థాన్‌లో 30 మందిని రెడీ చేశారు. ఈయన ఆపరేషన్లే.. 
సింహయాజి: వింటే గోడీ.. లేకపోతే ఈడీ. 
ఎమ్మెల్యేలు: గోడీ అంటే? 
సింహయాజి: గోడీ అంటే సఖ్యత.. లేకపోతే ఈడీ దాడులు. దాదాపు 38 మంది లిస్ట్‌లో ఉన్నారు. మన తెలంగాణలోనైనా వింటే గోడీ.. లేకపోతే ఈడీ ఎటాక్‌ అంటామన్నమాట. 
నందు: స్వామి దగ్గర లిస్టు ఉంది. స్వామికి ఆ లిస్ట్‌ ఇచ్చారు సంతోష్‌ వాళ్లు. ఇందులో అసలువారిని టచ్‌ చేయరు. పక్కనున్నోళ్లనే. రామేశ్వర్‌రావును వదిలేశారు. బీజేపీకి 100 (కోట్లు) ఇచ్చారు.. దండంపెట్టి.. 
సింహయాజి: ఆ 100 (కోట్లు) ఇస్తేనే ముగ్గురొచ్చారు. అమిత్‌షా, మిగతావారు.. రామేశ్వర్‌రావు­పై కేసు ఉంది. దాన్ని తప్పించుకోవడానికే డబ్బులిచ్చి ఫేవర్‌గా ఉండటానికే వాళ్లను ఇన్వైట్‌ చేశారు. 
ఎమ్మెల్యేలు: ఇక్కడైతే మొత్తమ్మీద బండి సంజయ్‌దేమీ నడవదు 
సింహయాజి: బండికి గండే.. ఇప్పుడంతా ఎవరికి వారు హైకమాండ్‌కు టచ్‌లో ఉంటున్నారు. అదే చూస్తున్నారు. కొత్త రక్తం వస్తే దానికి అంటగట్టాలని చూస్తున్నారు. 
ఎమ్మెల్యేలు: మరి ఊ అంటే మోదీతో మాట్లాడుతాం అన్నట్టు మాట్లాడుతారు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు 
నందు: నిన్న మొన్న వచ్చినోడితో సహా ప్రతీ ఒక్కరి ఇన్ఫర్మేషన్‌ ఉంటుంది. ఎవరిని ఎక్కడ కట్‌ చేయాలో ఆయనకు తెలుసు. కిషన్‌రెడ్డి ఏంటి, కిషన్‌రెడ్డికి సీఎంతో సంబంధం ఏంటి అన్నీ మోదీకి తెలుసు. అయితే ఎవరినీ ఏమీ అనకుండా అలా నడిపిస్తారు. బండి సంజయ్‌కి అపాయింట్‌మెంటే లేదు. 
(అంతా నవ్వులు)  

డబ్బుకు సమస్య లేదు
భారతి: సంతోష్, అమిత్‌ షా ఒకేచోట ఉన్నారు. తుషార్‌ వేరే చోట ఉన్నారు. ఫోన్‌ కలవడం లేదు. డబ్బులు ఇవ్వడంలో ఎలాంటి సమస్యా లేదు. ఈ రోజే మీ ముగ్గురి పేర్లు తెలిశాయి. మీ పేర్లు పంపొద్దని చెప్పా. ఇంటిలిజెన్స్‌కు సమాచారం వెళ్తే ఇబ్బందులు వస్తాయని చెప్పా.  
రోహిత్‌రెడ్డి: ఇప్పటినుంచి ఏ విధంగా ముందుకు వెళతారు అని మా ఎమ్మెల్యేలు అడుగుతున్నారు? 
భారతి: మీ తరహాలోనే వాళ్లకు కూడా కొన్ని షరతులు ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? అని అడుగుతారు. నేను మధ్యవర్తిని మాత్రమే. 
(ఈలోగా తుషార్‌ నుంచి ఫోన్‌.. మలయాళంలో) 
భారతి: తుషార్‌ గారు.. లైన్‌లో రోహిత్‌రెడ్డి ఉన్నారు. రోహిత్‌రెడ్డికి ఫోన్‌ ఇస్తున్నా. అతనితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు నా ముందే ఉన్నారు. గతంలో చర్చించినట్లు డబ్బుల కోసం అడుగుతున్నారు. వాళ్లకు ఉన్న సమస్యలను చెప్తున్నారు. (భారతి ఫోన్‌ రోహిత్‌కు ఇచ్చాడు) 
రోహిత్‌రెడ్డి: తుషార్‌ గారూ.. ఎలా ఉన్నారు? మేం మునుగోడు ఎన్నికలో ఉన్నాం.  
తుషార్‌: రేపటి నుంచి ఎప్పుడైనా కలుద్దాం. బీఎల్‌ సంతోష్‌ను ఏ తేదీ రావాలో అడుగుతా. 3న ఎన్నిక ఉంది కదా. 4న కలుద్దాం. మీకు ఏ రోజు వీలవుతుంది. 
రోహిత్‌రెడ్డి: ఈ రోజు లేదా రేపు పూర్తిచేస్తే బాగుంటుంది. అందుకే మిగతా ఎమ్మెల్యేలను ఈ రోజు మునుగోడు నుంచి రప్పించా.  
తుషార్‌: రేపు లేదా ఎల్లుండి వీలైనంత త్వరగా సంతోష్‌ టైమ్‌ తీసుకుంటా. అంతకంటే ముందు మనం కలుద్దాం.  
రోహిత్‌రెడ్డి: తుషార్‌ గారూ.. మీరు ఈ రోజు రాత్రి లేదా రేపు హైదరాబాద్‌కు రాగలరా.. మేము ప్రమాదకర పరిస్థితుల్లో పడతాం.  
తుషార్‌: మనందరం బీఎల్‌ సంతోష్‌ను కలుద్దాం 
భారతి: వాళ్లు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. వారి వెనుక నిఘా వర్గాలు ఉన్నాయి.  
రోహిత్‌రెడ్డి: మీరు ఫిగర్‌ ఎంతో నేరుగా చెప్పండి 
భారతి: తుషార్‌ గారు.. మొత్తం నలుగురు ఉన్నారు. టు టు ఫైవ్‌..  
రోహిత్‌రెడ్డి: ఫిఫ్టీ పర్సెంట్‌ ఇప్పుడు 
భారతి: సెవెన్‌.. ఫైవ్‌.. (మళయాలంలో సంభాషణ), ఈ రోజే డబ్బు కావాలని అడుగుతున్నారు.  
తుషార్‌: సంతోష్‌ ఫోన్‌ కలవడం లేదు. అమిత్‌షా మీటింగ్‌లోఉన్నారు. అందుబాటులోకి రావడం లేదు.  
రోహిత్‌రెడ్డి: ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్‌ ముడితె జంప్‌ 
గువ్వల: ప్రచారానికి వెళ్లకపోతే మేము ఎక్కడ ఉన్నామో మా డ్రైవర్లను అడిగి ఆరా తీస్తున్నారు. 
భారతి: నా ఆరోగ్యం బాలేదు. అయినా వచ్చా.. ఈ రోజు పని పూర్తి చేయాలనే అనుకున్నాం. 
రోహిత్‌రెడ్డి: ఢిల్లీని కూడా స్వామీజీ అపరేట్‌ చేస్తున్నారట, వచ్చే వారం ఖతం అట. 
గువ్వల: ఎవరి ద్వారా అవుతోంది. 
భారతి: తొలిసారి మేము ఇలా వేరే చోటకు వచ్చి మాట్లాడుతున్నాం. కానీ చేరే వారు ఢిల్లీకి వచ్చి ఫిఫ్టీ పర్సెంట్‌ తీసుకుని వెళ్తారు. ఇప్పటివరకు బీజేపీ ఇలానే చేస్తూ వస్తోంది. 
గువ్వల: ఆప్‌లో ఎవరిని చేర్చుకుంటున్నారు? 
భారతి: కేజ్రీవాల్‌ రైట్‌ హ్యాండ్‌ను చేర్చుకుంటున్నాం. 33 మెజారిటీ, 36 మంది రెడీగా ఉన్నారు. రాజస్తాన్‌లో 21 మంది ఉన్నారు.  
సింహయాజీ: రాజస్తాన్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా నా భక్తుడు. 
రోహిత్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి: గంట సేపైనా ఎదురు చూస్తాం. బీఎల్‌ సంతోష్‌తో మాట్లాడండి.  
భారతి: కర్ణాటకలో ఎమ్మెల్యేలను చెన్నై తీసుకెళ్లి ఇండిగోలో ముంబయికి చేర్చాం. అక్కడ వారికి కావాల్సింది ఇచ్చాం. 
సింహయాజి: పంచెలు, రుమాళ్లు చుట్టుకుని కర్ణాటక ఎమ్మెల్యేలు కూలీల్లా ట్రాక్టర్‌లో వచ్చారు. 
భారతి: మొదట రామనగరకు వెళ్లాం. అక్కడ ఫామ్‌హౌస్‌ నుంచి ట్రాక్టర్‌లో యెలహంకకు తీసుకెళ్లాం. అక్కడ నుంచి బస్సులో చెన్నైకు తీసుకెళ్లాం. 
సింహయాజి: ఢిల్లీలో ఇంటెలిజెన్స్‌ అంతా కేంద్రం పరిధిలో ఉంటుంది. 
భారతి: మొదటి పే మెంట్‌ ఇస్తాం. ఢిల్లీలో వాళ్లకు డబ్బులు వద్దు. పవర్‌ మారగానే పదవులు ఇస్తాం. సింగిల్‌ రూపీ కూడా ఇవ్వడం లేదు. బీజేపీ నుంచి సీఎం ఉంటారు. డిప్యూటీ సీఎం, ఇతర పదవులు ఆమ్‌ ఆద్మీ నుంచి వచ్చే వారికి ఇస్తాం. చర్చలు పూర్తయ్యాయి. బీజేపీ ఏం చెప్తుందో అది చేస్తుంది. కమిట్‌ అయితే చేస్తుంది. 
గువ్వల: మీలా ఎంతమంది పనిచేస్తున్నారు? 
భారతి: పార్టీ విషయాలు వేరు. మానవత్వం, నమ్మకం ఉండాలి. బీజేపీ నమ్మకంపైనే ఆధారపడుతుంది. ఏ రాష్ట్రం తీసుకున్నా సరే. 
గువ్వల: విశ్వాసం పేరిట అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాలను కూల్చివేస్తారన్న మాట 
రోహిత్‌రెడ్డి: మంత్రి పదవి రానందునే గువ్వల బయటకు రావాలని అనుకుంటున్నాడు. 
భారతి: బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడిన ప్రతిచోటా చూడండి. కర్ణాటకలో 16 మంది వస్తే 12 మందికి మంత్రి పదవులు హామీ ఇచ్చాం. 13 మందికి ఇచ్చాం. మా సొంత ఎమ్మెల్యేలు 5, 6 సార్లు గెలిచినా కూడా పక్కన పెట్టాం. ఎందుకంటే మేం మాట ఇచ్చాం వారికి. అదే తరహాలో మీకు కూడా మంత్రి పదవులు ఇస్తాం. నిజానికి షిండేకు మేము డిప్యూటీ సీఎం ఆఫర్‌ చేశాం. కానీ చర్చల తర్వాత కావాల్సిన నంబర్‌ వచ్చిన తర్వాత సీఎం పోస్ట్‌ డిసైడ్‌ అయింది. అనుభవం లేకున్నా అన్నింటినీ మేనేజ్‌ చేశాడు షిండే. మీరు మంత్రి అయినా మీ అపాయింట్‌మెంట్‌ లేకుండా రాలేము. అదీ మా ప్రోటోకాల్‌.. కానీ జోక్యం చేసుకోం. 
గువ్వల: షిండే లాంటి వాళ్ల మీద నియంత్రణ లేకుండా సీఎంలు చేసి ఏం చేస్తారు? 
భారతి: సీఎం అయిన తర్వాత వాళ్లు బీజేపీ అడ్మినిస్ట్రేషన్‌లోకే వస్తారు.
చదవండి: న్యాయవ్యవస్థే కాపాడాలి.. దేశంలో ప్రజాస్వామ్యం హత్య: సీఎం కేసీఆర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top