జాతీయ జెండా ఆవిష్కరించిన కేసీఆర్‌ | Telangana CM KCR Flag Hoisting In Pragathi Bhavan | Sakshi
Sakshi News home page

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

Aug 15 2020 12:11 PM | Updated on Aug 15 2020 8:49 PM

Telangana CM KCR Flag Hoisting In Pragathi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ప్రగతి భవన్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. జాతీయ జెండాను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. కేవలం ముఖ్యనాయకులు, కొద్దిమంది అధికారుల సమక్షంలోనే ఈ వేడుకలను నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్ళి అమరులకు నివాళర్పించారు. దీనిలో భాగంగా దేశానికి సేవ చేసిన వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం ఆవిర్భావం దగ్గర్నుంచీ గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఈసారి వేడుకల వేదికను ప్రగతి భవన్‌కు మార్చారు.

సిరిసిల్ల: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో శనివారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే ముందు వరసలో ఉందన్నారు. కరోనా కారణంగా స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, వివిధ శాఖల అధికారులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

వారి సంకల్ప బలానికి సలాం..
నిజామాబాద్‌: 
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వీడియో సందేశం విడుదల చేశారు. కరోనా బాధితుల కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ తనకు స్ఫూర్తి అని తెలిపారు. వారి సంకల్ప బలానికి నా సలాం అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement