
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సమావేశం కానుంది. రాష్ట్రంలో పంచా యతీ ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమా వేశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
గిగ్ వర్కర్స్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న బిల్లు, గో సంరక్షణ విధివిధానాలపై సైతం చర్చించి మంత్రివర్గం ఆమోదించనుంది. కేంద్రం తీసుకున్న విధాన నిర్ణయం ఆధా రంగా ప్రైవేటు క్యాబ్ సేవలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావ డం వంటి అంశాలపై సైతం మంత్రివర్గ భేటీలో చర్చించే అవకాశం ఉంది.