తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం | Telangana Cabinet Key Decision | Sakshi
Sakshi News home page

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం

Oct 23 2025 6:43 PM | Updated on Oct 23 2025 8:17 PM

Telangana Cabinet Key Decision

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సెక్షన్‌ 21(3) తొలగింపునకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తీసుకురానుంది.

కాగా, స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలు 9, 41, 42ల అమలును రాష్ట్ర హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. ఈ నేపథ్యంలో కేబినెట్‌ సమావేశంలో న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement