సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ల పనివేళలు పెంపు | Sub-Registrar offices in Telangana have extended their working hours | Sakshi
Sakshi News home page

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ల పనివేళలు పెంపు

Mar 27 2026 5:02 AM | Updated on Mar 27 2026 5:02 AM

Sub-Registrar offices in Telangana have extended their working hours

ఈనెల 28, 30, 31 తేదీల్లో మార్పులు 

ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు 

రోజుకు 88 స్లాట్లలో రిజిస్ట్రేషన్లు  

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పనివేళలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 28, 30, 31 తేదీల్లో ఈ పనివేళలను పెంచుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ రోజుల్లో ఉదయం 10.30 గంటల నుంచి 5.30 గంటల వరకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పనిచేస్తున్నాయి.

తాజా ఉత్తర్వుల ప్రకారం ఈనెల 28, 30, 31 తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అందరు సబ్‌రిజిస్ట్రార్లు ఎలాంటి సెలవులు తీసుకోకుండా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పనివేళల పెంపుతో రోజుకు 88 ఆన్‌లైన్‌ స్లాట్లు అందుబాటులోకి రానున్నట్టు స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ వర్గాలు వెల్లడించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement