స్పీకర్‌ స్థానం నుంచి మంత్రి పదవి వైపు? | Speaker Gaddam Prasad to Meet Rahul Gandhi | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ స్థానం నుంచి మంత్రి పదవి వైపు?

May 30 2026 12:39 PM | Updated on May 30 2026 12:51 PM

Speaker Gaddam Prasad to Meet Rahul Gandhi

రాహుల్‌ గాందీతో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ భేటీ.. కేబినెట్‌లో చోటు కోసమేనా? 

జూన్‌ చివరి వారంలో తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళన? 

రెండున్నరేళ్ల ఫార్ములాపై అధిష్టానం కసరత్తు.. అంతర్గత నివేదికల సేకరణ!  

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన జరగనుందనే ప్రచారం కాంగ్రెస్‌ వర్గాల్లో హీట్‌ పెంచుతోంది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లో కొత్త ముఖాలకు అవకాశం కలి్పంచేందుకు అధిష్టానం గట్టిగా యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే నివేదికలు తెప్పించుకుంటున్న ఏఐసీసీ పెద్దలు.. జూన్‌ చివరి వారంలో ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఢిల్లీ వేదికగా మారిపోయాయి. 

స్పీకర్‌ స్థానం నుంచి మంత్రి పదవి వైపు? 
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో పత్రిపక్ష నేత రాహుల్‌ గాం«దీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తనకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు కలి్పంచాలని ఆయన రాహుల్‌ను కోరినట్లు విశ్వసనీయ సమాచారం. స్పీకర్‌ పదవి కంటే మంత్రిగా ప్రజాసేవ చేసేందుకే ఆయన మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఢిల్లీ బాట పట్టిన ఆశావహులు!... 
మంత్రివర్గంలో మార్పుచేర్పులు ఖాయమనే సంకేతాలు రావడంతో రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్‌ ఎమ్మెల్యేలు ఢిల్లీ వేదికగా లాబీయింగ్‌ మొదలుపెట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో మంత్రి పదవి దక్కించుకునేందుకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల వారిద్దరూ ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కలిసి తమకు న్యాయం జరుగుతుందనే ధీమా వ్యక్తం చేశారు. 

తెరవెనుక సీనియర్ల ప్రయత్నాలు.. 
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వార్తల నేపథ్యంలో పారీ్టకి చెందిన సీనియర్‌ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మంచిర్యాల ఎమ్మె ల్యే ప్రేమ్‌సాగర్‌రావు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు సైతం ఢిల్లీకి వచ్చారు. తమ అసంతృప్తిని, ఆకాంక్షలను అధిష్టానం ముందుంచి హైదరాబాద్‌ పయనమయ్యారు. అధిష్టానం పెద్దలను కలిసేందుకు వచ్చిన వారు.. మీడియా కంట పడకుండా అత్యంత గోప్యత పాటించడం గమనార్హం.   

Advertisement
 
Advertisement
Advertisement