Snake: ఐదు అడుగుల నాగుపాము పట్టివేత | Sakshi
Sakshi News home page

Snake: ఐదు అడుగుల నాగుపాము పట్టివేత

Published Mon, Aug 23 2021 10:18 AM

Snake Rescue Men Catches The Snake In Nizamabad - Sakshi

సాక్షి, నవీపేట(నిజామాబాద్‌): మండలంలోని నాళేశ్వర్‌ గ్రామ శివారులో గత రెండు రోజులుగా  రైతులను భయపెడుతున్న ఐదు అడుగుల నాగుపాము ఆదివారం దొరికింది. గ్రామానికి చెందిన పోశెట్టి అనే రైతు పొలంలో రెండు రోజుల కిందట కనిపించిన నాగుపాము పలువురిని భయాందోళనకు గురి చేసింది.

రైతులు అటువైపుగా వెళ్లేందుకు భయపడ్డారు. ఆదివారం మళ్లీ  ఆ పాము కనిపించడంతో నందిపేటకు చెందిన సర్వార్‌ఖాన్‌ పాములు పట్టడంలో దిట్ట అతనికి సమాచారమిచ్చారు. ఆయన తన చాతుర్యంతో పామును పట్టేశాడు. పట్టుకున్న పామును అటవీశాఖ అధికారులకు అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు. 

చదవండి: మిస్టర్‌ తెలంగాణగా ఎంపికైన సింగరేణి బిడ్డ

Advertisement
 

తప్పక చదవండి

Advertisement