
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని..
4 నెలల క్రితం హత్య చేసి పాతిపెట్టిన వైనం
మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు
శివ్వంపేట (నర్సాపూర్): ప్రియుడితో కలసి రెండేళ్ల కన్నబిడ్డను హత్య చేసి పాతిపెట్టిందో తల్లి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటుందని భావించి వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నాలుగు నెలల క్రితం జరిగిన ఈ ఘటన శుక్రవారం మెదక్ జిల్లా శివ్వంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని శభాష్‌పల్లిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బంటు మమతకు సిద్దిపేట జిల్లా రాయిపోల్ మండలం వడ్డేపల్లికి చెందిన భాస్కర్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి నాలుగేళ్ల కుమారుడు, కూతురు తని్వసి (2) సంతానం. కాగా, మమత శభా‹Ùపల్లికి చెందిన ఫయాజ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. మార్చి నెలలో ఇద్దరూ కలసి పారిపోవడంతో పెద్దలు సర్ది చెప్పి అత్తగారింటికి పంపించారు. మేలో పిల్లలను తీసుకొని మమత తల్లిగారింటికి వచ్చింది. ఆమెలో ఎలాంటి మార్పు రాకపోగా.. రెండోసారి మే 21న కుమారుడిని తల్లిగారి ఇంట్లోనే వదిలేసి కూతురు తన్విసిని తీసుకుని ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో మమత తండ్రి రాజు ఫిర్యాదు మేరకు శివ్వంపేట పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుంటూరులో దొరికిన మమత, ఫయాజ్
శివ్వంపేట పోలీసులు ఏపీలోని గుంటూరులో మమత, ఫయాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కూతురు తని్వసి విషయంలో స్పష్టత రాకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. గొంతు పిసికి హత్య చేసి, పాతి పెట్టినట్లు చెప్పారు. దీంతో శుక్రవారం సాయంత్రం శభాష్ పల్లి గ్రామ శివారులో చిన్నారిని పాతిపెట్టిన ప్రదేశాన్ని కనుగొన్నారు. డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ రంగాకృష్ణ, తహసీల్దార్ కమలాద్రి, ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి సమక్షంలో కుంట కట్టు కాల్వలో పూడ్చిన చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసిన అనంతరం గ్రామస్తులు నిందితులకు దేహశుద్ధి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఫయాజ్‌పై ఇప్పటికే దొంగతనాలు ఇతర నేరాలకు సంబంధించి 30కి పైగా కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు.