మాదాపూర్‌లో అర్ధరాత్రి మద్యం మత్తులో... | Road Accident In Madhapur Cyberabad Traffic Police Shares Video | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌లో అర్ధరాత్రి మద్యం మత్తులో...

Jul 24 2021 7:14 PM | Updated on Jul 24 2021 7:22 PM

Road Accident In Madhapur Cyberabad Traffic Police Shares Video - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తూ ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. పరిసరాలను గమనించకుండా రోడ్డు మధ్యలోకి రావడంతో.. వెనుక నుంచి వస్తున్న ఇన్నోవా బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియోను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్విటర్‌లో షేర్‌ చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపరాదని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement